Advertisementt

అటు కీర్తి, ఇటు సమంత మధ్య మహానటి!

Thu 09th Mar 2017 03:35 PM
samantha,keerthi suresh,mahanati,savitri  అటు కీర్తి, ఇటు సమంత మధ్య మహానటి!
అటు కీర్తి, ఇటు సమంత మధ్య మహానటి!
Advertisement
Ads by CJ

మ‌హాన‌టి సావిత్రి పేరుతో ఒక చిత్రం తెర‌కెక్కుతున్న విషయం తెలిసిదే. మహానటి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. అయితే అశ్వ‌నీద‌త్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తయినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ చిత్రం కోసం ఇప్పటికే స‌మంత‌, కీర్తి సురేష్‌ల‌ను హీరోయిన్ లుగా ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే వీరిద్దరికీ సావిత్రి పాత్ర కోసం మేకప్ టెస్ట్ లు వేసి చూసుకున్నా.. ఇంకా సావిత్రి పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. కాగా విశ్వ‌స‌నీయంగా అందిన సమాచారాన్ని బట్టి చూసినట్లయితే కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుందని, స‌మంత జ‌ర్న‌లిస్టు పాత్రను పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే సావిత్రి తొలినాళ్ళలో ఎలా ఉండేదో ఇప్పుడు కీర్తి సురేష్ అలా ఉంది అంటున్నారు చిత్ర యూనిట్.

అలాగే ‘మాయాబ‌జార్’ వంటి చిత్రాల్లో అయితే సావిత్రి చాలా బొద్దుగా దర్శనమిస్తుంది. అలా అటువంటివి చూపించాల్సి వచ్చినప్పుడు మరి కీర్తి సురేష్ సరిపోతుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్పాలంటే.. సావిత్రి చిత్రంలో ఎక్కువ సన్నివేశాలు సావిత్రి యంగ్ గా ఉన్నప్పటివే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చిత్రయూనిట్ ద్వారా వెల్లడౌతుంది. అయితే కొన్ని సన్నివేశాలకు మాత్రం సావిత్రి బరువు పెరగనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే.. స‌మంత పాత్ర‌ని మనం ఏం త‌క్కువ అంచ‌నా వేయాల్సిన అవసరం లేదని ఎందుకంటే.. ఈ క‌థ‌కి ఆయువుపట్టు సమంత పాత్రేనని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మ‌హాన‌టి పేరుతో చిత్రబృందం ఓ పోస్ట‌ర్‌ని డిజైన్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు విడుదల చేసింది. ఆ పోస్టర్ లో అటు కీర్తి, ఇటు స‌మంత మ‌ధ్య‌న సావిత్రి దర్శనమిస్తూ.. చూపరులకు అదరగొడుతుంది. ఈ పోస్టర్ పై ‘తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం... తరతరాలు గర్వించే మహానటి సావిత్ర కథ’ అని రాసి ఉంది. మొత్తానికి మహానటి సినీ పరిశ్రమకు ఓ అద్భుతం. ఆమె జీవితంపై వచ్చే చిత్రం ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూద్దాం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ