పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ వరసకు మావయ్య అవుతాడు. పవన్ వదినమ్మ సురేఖ అన్న అరవింద్ కొడుకు అల్లు అర్జున్. వీరిద్దరూ మెగా హీరోలే. అయితే వీరిద్దరూ ఎంత సఖ్యంగా ఉన్నాకూడా వీరి అభిమానులు మాత్రం కొట్టుకు చస్తున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వీరు సోషల్ మీడియా సాక్షిగా చెలరేగిపోతున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటున్నారా? అదేనండి వీరిద్దరూ ఇప్పుడు తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే టైం దగ్గర పడుతుంది. పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' తో, అల్లు అర్జున్ 'డీజే' తో కొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చెయ్యడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాకుండా వీరి సినిమాల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి.
ముందుగా పవన్ నటించిన 'కాటమరాయుడు' టీజర్ ఫిబ్రవరి 4 న విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టించి టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో వుంది. ప్రస్తుతం 'కాటమరాయుడు' టీజర్ కి 96 లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది. అలాగే దాదాపు 2.50 లక్షల లైక్స్ తో కొత్త రికార్డు సృష్టించింది. అసలు ఒక తెలుగు టీజర్ కి ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం ఇదే మొదటిసారి. ఆ రకంగా 'కాటమరాయుడు' రికార్డ్స్ కి నాంది పలికింది.
ఇక అల్లు అర్జున్ 'డీజే' విషయానికొస్తే ఫిబ్రవరి 24 న 'డీజే' ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చెయ్యగా ఇప్పటివరకు 80 లక్షలపైగా వ్యూస్ రాగా 1 .5 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక లైక్స్ తోపాటు డీజే టీజర్ డిజ్ లైక్స్ ని కూడా 1 .50 లక్షలు సొంతం చేసుకుని చెత్త రికార్డు ని కూడా నెలకొల్పింది. అసలు టాలీవుడ్ లో ఏ చిత్రానికి ఇన్ని డిజ్ లైక్స్ రాలేదని సర్వేలు చెబుతున్నాయి. మరి ఆ డిజ్ లైక్స్ ని పవన్ ఫ్యాన్స్ చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇక హీరోల చుట్టరికాలెలాఉన్నా అభిమానుల మధ్యన మాత్రం తీవ్ర కొట్లాటలు, విద్వేషాలు, పగలు రగులుతున్నాయి.
మరి రికార్డులతో దుమ్ములేపుతున్న మామ అల్లుళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాక ఎంతటి రికార్డులు కొల్లగొడతాయో.. ఇంకెన్ని గొడవలకు దారితీస్తాయో అని అందరూ చర్చించుకుంటుండటం విశేషం.