నాగ్ అశ్విన్ ఎప్పటినుండో మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. అయితే ఇంతవరకు ఆ చిత్రం పట్టాల మీదకి రాలేదు. అసలు ఆ సినిమా మొదలవ్వకపోవడానికి కారణం సావిత్రి పాత్రకి నటీమణి ఎంపిక కాకపోవడమే. ముందుగా సావిత్రి పాత్రకి విద్యాబాలన్ అనుకున్నప్పటికీ ఆమె ప్లేసులోకి నిత్య మీనన్ వచ్చి చేరింది. ఇక నిత్యని కాదని మళ్ళీ హీరోయిన్ వేటలో వున్న నాగ్ అశ్విన్ సమంతని ఒక ముఖ్యమైన పాత్రకి ఎంపిక చేసాడు. ఇక ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు కూడా పెద్దగా ప్రచారంలో లేవు. ఇక ఈ సినిమా అసలు తెరకెక్కుతుందా? అనే అనుమానం మొదలైపోయింది అందరిలో.
అయితే మహానటి చిత్రం గురించి ప్రచారం డల్ అయ్యేసరికి తేరుకున్న నాగ్ అశ్విన్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహానటి పోస్టర్ ని రివీల్ చేసాడు. అందులో సావిత్రి ఫోటో కి ఇరువైపులా కీర్తి సురేష్, సమంతలు వున్నారు. మరి సావిత్రి పాత్రని కీర్తి సురేష్ చేస్తుందని... సమంత ఎలాంటి పాత్ర చేస్తుందో? అనిగాని చెప్పకుండా కేవలం పోస్టరుతోనే సరిపెట్టేసాడు దర్శకుడు. మరి సావిత్రి బయో పిక్ లో చాలానే విశేషాలున్నాయి. ఆమె నటిగా వున్నప్పుడు వున్న జీవితం వేరు, నటనకు దూరమైనాక జీవితం వేరు. మరి ఈ రెండు ఎపిసోడ్స్ ని నాగ్ అశ్విన్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.
ఇకపోతే మహానటి సావిత్రి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని... ఆమె కథను మనకు నెరేట్ చేసే పాత్రను సమంత పోషిస్తోందని అంటున్నారు. మరి నాగ్ అశ్విన్ ఎమన్నా ఈ చిత్రంపై స్పందిస్తే మిగతా విషయాలు తెలిసే అవకాశముంది.