Advertisementt

బాహుబలి 2 ట్రైలర్ టాకే ఇలా ఉంటే...!!

Wed 08th Mar 2017 07:52 PM
bahubali 2 trailer talk,kalyanaramana twit,ss rajamouli,prabhas  బాహుబలి 2 ట్రైలర్ టాకే ఇలా ఉంటే...!!
బాహుబలి 2 ట్రైలర్ టాకే ఇలా ఉంటే...!!
Advertisement
Ads by CJ

బాహుబలి2 కి సంబంధించిన పబ్లిసిటీ ని స్టార్ట్ చేసేసింది రాజమౌళి అండ్ టీమ్. బాహుబలి పోస్టర్స్ ని మీడియాకి విడుదల చెయ్యడమే కాకుండా ఛానెల్స్ కి ఇంటర్వ్యూ లు కూడా ఇస్తూ రాజమౌళి బిజీ అయిపోయాడు. అయితే బాహుబలి ద కంక్లూజన్ కి సంబందించిన ట్రైలర్ ని గాని టీజర్ ని గాని ఇప్పటివరకు విడుదల చెయ్యకుండా కేవలం మోషన్ పోస్టర్స్ ని మాత్రమే విడుదల చేస్తున్న బాహుబలి టీమ్ ఇప్పుడు ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేసేశారు. అంటే ట్రైలర్ విడుదలకు సర్వం సిద్దమనే సంకేతాలిస్తున్నారు. మరి ట్రైలర్ ని రిలీజ్ చెయ్యకుండానే  బాహుబలి ట్రైలర్  ని చూశానంటూ కీరవాణి తమ్ముడు కళ్యాణరమణ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు.

తాను ప్రత్యేకించి బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ ని వీక్షించానని... ఆ ట్రైలర్ చూస్తుంటే గుండెలు అదిరాయని... కేవలం బాహుబలి ట్రైలర్ 100  రోజులు ఆడుతుందని చెబుతున్నాడు. మరి ఈయన గారి ట్వీట్ కి జనాలకు ఇంకా బాహుబలి మీద ఎక్సపెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి... ఈ ట్రైలర్ ట్వీట్ చూసాక అది మరింత పెరిగిందనే టాక్ వినబడుతుంది.బాహుబలి గురించి ఏది తెలిసిన అది సంచలనమే అవుతుంది. అలా క్రియేట్ చేసాడు రాజమౌళి. బాహుబలి విడుదలకు ముందే ఇంత సెన్సేషన్ సృష్టిస్తుంటే ఇక విడుదలయ్యాక ఈసారి ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ