Advertisementt

చిరు 151 కి మళ్లీ డౌటే..!

Wed 08th Mar 2017 06:49 PM
chiranjeevi,ar murugadoss,stalin,tagore,151 movie  చిరు 151 కి మళ్లీ డౌటే..!
చిరు 151 కి మళ్లీ డౌటే..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో రాజకీయాల్లోకి ప్రవేశించి తిరిగి మళ్ళీ సినిమాలపైనే దృష్టి పెట్టిన విషయం కూడా విదితమే. టాలీవుడ్ లో బాగా రచయితల కొరత ఉందనే చెప్పాలి. గొప్ప రచయితలంతా కూడా దర్శకులుగా మారుతున్న పరిణామాన్ని చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు స్టార్ హీరోలకు సరిపడ కథలను రాసే రచయితలు కొరతగానే ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ ను కూడా రచయితల కొరతే వేదిస్తుందని చెప్పాలి. మెగాస్టార్ రాజకీయాల నుండి సినిమాలకు రీఎంట్రీ ఇచ్చేందుకు సంబంధించిన కథ కోసం దాదాపు రెండేళ్ళు నిరీక్షించిన విషయం తెలిసిందే. అప్పట్లో సినీ పరిశ్రమలోని చాలామంది రచయితలు, దర్శకులు చాలా కథలు చెప్పిన విషయం తెలిసిందే. వాటిల్లో మెగాస్టార్ కి ఏ ఒక్కటి నచ్చక ఏమాత్రం రిస్క్ చేయలేక తమిళ సినిమా అయిన ‘కత్తి’ రిమేక్ రైట్స్ కొనుక్కొని చాలా జాగ్రత్తగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

అయితే మెగాస్టార్ కి మళ్లీ కథల సమస్యే వచ్చి పడినట్లుగా తెలుస్తుంది. ఖైదీ నెంబర్ 150 చిత్రం తర్వాత ఇప్పటివరకు మెగాస్టార్ కొత్త సినిమా అదీ, ఇదీ అంటూ నాన్చుతున్నారే గానీ అధికారికంగా ఏదీ ప్రకటించని విషయం కూడా తెలిసిందే. కానీ... సురేందర్ రెడ్డి తో చేయాలనుకున్న ఉయ్యాలవాడ కథను పోస్టుపోన్ చేసి ఈ మధ్య మెగాస్టార్ మరికొన్ని కథలను వింటున్నాడని తెలుస్తుంది. ఇలా దేనితోనూ మెగాస్టార్ సంతృప్తి చెందక మళ్ళీ కోలీవుడ్ పైనే దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. అందుకనే తాజాగా మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దర్శకుడు మురగదాస్ తో మెగాస్టార్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.  మీడియా మాత్రం మహేష్ సెట్లోకి చిరు అని ప్రచారం చేసుకున్నా మెగాస్టార్ ఏం సరదా కోసం సూపర్ స్టార్ షూటింగ్ చూడటానికి రాలేదన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే మెగాస్టార్ అక్కడికి వెళ్ళింది దర్శకుడు మురగదాస్ కోసమని తెలుస్తుంది. మెగాస్టార్ దర్శకుడు మురగదాస్ ని కలిసి ఒక మంచి సబ్జెక్ట్ వుంటే చెప్పమని మురగదాస్ ని చిరంజీవి కోరినట్లుగా తెలుస్తుంది. అందుకు ఆ దర్శకుడు ఓకే అని వెల్లడించినట్లు కూడా వార్తలు పొక్కుతున్నాయి.

గతంలో మెగాస్టార్ తో మురగదాస్ స్టాలిన్ చేసిన విషయం తెలిసిందే. దానికంటే ముందు  చిరంజీవి కెరీర్ కే తలమానికంగా నిలిచింది చిరు జీవితంలో మైలురాయిగా మిలిగింది ఠాగూర్ చిత్రం కూడా మురగదాస్ స్టోరీనే అన్న విషయం మర్చిపోకూడదు. ఇంకా చెప్పాలంటే ఖైదీ నెంబర్ 150 చిత్రానికి మూలం మురగదాసే. కాగా మెగాస్టార్ కి మురగదాస్ పై మంచి గురి ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం చిరంజీవి తర్వాత సినిమా మురగదాస్ తో ఓకే ఔతుందేమో!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ