Advertisementt

కమల్ హాసన్ టైమ్ స్టార్ట్ అయ్యింది..!

Wed 08th Mar 2017 04:57 PM
kamal haasan,shruti haasan marriage news,kamal haasan political entry,kamal time starts  కమల్ హాసన్ టైమ్ స్టార్ట్ అయ్యింది..!
కమల్ హాసన్ టైమ్ స్టార్ట్ అయ్యింది..!
Advertisement
Ads by CJ

కమల్ హాసన్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. తాజాగా కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉండడంతో శశికళ వర్గం పై ట్వీట్స్ తో దుమ్మెత్తి పోస్తున్నాడు. మరోపక్క అభిమాన సంఘాలతో మీటింగ్స్ అంటూ తెగ బిజీ అయిపోతున్నాడు. ఎలాగూ రజినీకాంత్ రాజకీయాల్లోకి రానని చెప్పకనే చెబుతున్నాడు. అయితే కమల్ హాసన్ మాత్రం రాజకీయ అరంగేట్రానికి పావులు కదుపుతున్నట్టు తమిళనాట హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. అసలు కమల్ కి రాజకీయాలంటే పెద్దగా పడవు. అసలు వాటిల్లో జోక్యం చేసుకోవడానికి కమల్ ఇష్టపడేవాడు కాదు. కానీ ఇప్పుడు తమిళనాట ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆయన రాజకీయాల్లోకి వస్తాడనే సూచనలు కనబడుతున్నాయి.

ఇకపోతే కమల్ కి మరొక రకమైన సంతోషాన్ని కూతురు శృతి హాసన్ ఇవ్వబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. శృతి హాసన్ ఈ మధ్యన బాయ్ ఫ్రెండ్ తో చెక్కర్లు కొడుతూ మీడియాకి దొరికిపోయింది. అసలు బాయ్ ఫ్రెండ్ మైకేల్ గురించి నోరు విప్పని శృతి హాసన్ ఏకంగా పెళ్లి చేసుకుని తన తండ్రికి సంతోషాన్నివ్వబోతుందా? అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇక బాయ్ ఫ్రెండ్ మైకేల్ గురించి శృతి హాసన్ ఇప్పటికే తన తండ్రి కమల్ కి చెప్పినట్లు టాక్. ఇకపోతే కమల్, మైకేల్ లు ఇద్దరు లండన్‌లో క్వీన్ ఎలిజబెత్ ఆతిథ్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కలిసి చాలాసేపు ముచ్చటించుకున్నారని.... వీరిమధ్యన పెళ్లి ప్రస్తావన కూడా వచ్చినట్లు ప్రచారమైతే మొదలైంది.

మరి కూతురు తన కాళ్ళ మీద తాను నిలబడి సినిమాల్లో మంచి పొజిషన్ కి చేరుకొని ఇప్పుడు జీవితంలో కూడా సెటిల్ కాబోతుందనే వార్తతో కమల్ హాసన్ ఫుల్ హ్యాపీలో వున్నాడని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచారం చేస్తుంది. మరి ఒకపక్క పొలిటికల్ ఎంట్రీ మరోపక్క కూతురి పెళ్లి వార్తలతో కమల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ