సుచి లీక్స్ కోలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్నాయి. ఇప్పటిదాకా సుచి లీక్స్ తో విడుదలైన వీడియో లు, ఫొటోలతో తమిళ స్టార్స్ అంతా బెంబేలెత్తిపోతుంటే ఇంకా ఆ లీక్స్ అలా కొనసాగుతూనే వున్నాయి. మరి సుచిత్ర మాత్రం తనకేం తెలియదంటుంది. కానీ ఆ లీక్స్ కి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏ క్షణాన ఎవరి పర్సనల్ వీడియో లీక్ అవుతుందో అని టెన్షన్ పడి చస్తున్నారు హీరోహీరోయిన్స్. మరి ఈ లీక్స్ కి బెంబేలెత్తిపోతున్న కోలీవుడ్ స్టార్స్ కి కంటిమీద నిద్ర కరువైందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి ఈ ప్రకంపనలు కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే మరో పక్క టాలీవుడ్ లో గనక ఇలాంటి లీక్స్ గనక జరిగితే ఇక్కడి స్టార్స్ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి అంటూ కొంతమంది సెటైర్స్ వేస్తున్నారు.
ఇక్కడ కూడా సుచిత్ర లాంటి వారు ఎవరన్నా ఉంటే గనక వారు ధైర్యం గా ముందుకు వచ్చి ఇలాంటి లీక్స్ మొదలు పెడితే గనక కోలీవుడ్ స్టార్స్ వలె ఇక్కడ టాలీవుడ్ లో ఎంతమంది స్టార్స్ తెర మీదకు వస్తారో? అని అందరూ అప్పుడే చర్చించేసుకుంటున్నారు. హీరో హీరోయిన్స్ ఎవరన్నా ఒకటి రెండు సినిమాల్లో వరసబెట్టి నటిస్తే వారి మధ్యన ఏదో ఉందని పుకార్లు పుట్టించేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఇలాంటి ఎఫ్ఫైర్ న్యూస్ లు రానా మీద బోలెడన్ని హల్ చల్ చేశాయి. రానా అమ్మాయిలతో బాగా క్లోజ్ గా ఉంటాడని... ప్రవేట్ పార్టీలలో బాగా రెచ్చిపోతుంటాడనే అంటుంటారు. ఇది నిజమని సుచిత్ర లీక్స్ నిరూపించాయి. అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ఒకప్పుడు సమంత, సిద్ధార్థ ల గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అసలు వీరిద్దరికి పెళ్లిఅయిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి. మరి వీరు జంటగా చాలా చోట్లకి షికార్లకి వెళ్లినట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. అలాగే టాలీవుడ్ లోని ఓ కామెడీ హీరో మీద కూడా ఇలాంటి వార్తలు చాలానే ప్రచారం అయ్యాయి. ఆ హీరో..ఓ హీరోయిన్ తో పెళ్లి వరకు వెళ్లి చివరినిమిషంలో హ్యాండ్ ఇచ్చినట్లు వార్తలు వున్నాయి. ఈ విధంగా చూసుకుంటూ పొతే సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటివి కామనే అనే స్థాయికి సినీ ఇండస్ట్రీ లను దిగజార్చారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య టాలీవుడ్ హీరోలపై, దర్శకనిర్మాతలపై హీరోయిన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇలియానా బాలీవుడ్ పోతూ పోతూ..చాలా అసభ్యకరమైన మాటలు అన్న విషయం తెలిసిందే. అలాగే రాధికా ఆప్టే కూడా ఆ మధ్య ఓ మూవీ టీం పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అలాగే రీసెంట్ గా మాధవి లత నోరు విప్పితే కాపురాలు కూలతాయంటూ..ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. సో..ఇలాంటివి టాలీవుడ్ లో చాలానే వున్నాయి. వీటన్నిటిని బయటికి తీస్తే..కోలీవుడ్ కంటే టాలీవుడ్ సంచలనం గా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.