Advertisementt

మహేష్ పోకిరి తరహాలో నితిన్ సినిమా!

Wed 08th Mar 2017 03:13 PM
nithiin,pokiri,mahesh babu,hanu raghavapudi  మహేష్ పోకిరి తరహాలో నితిన్ సినిమా!
మహేష్ పోకిరి తరహాలో నితిన్ సినిమా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో నితిన్ లవర్ బాయ్ గా మంచి ఆకట్టుకునే మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. సుమారు తన 15 ఏళ్ల కెరీర్‌లో ఓ 22 సినిమాల వరకు చేశాడు. అప్పుడప్పుడు కొన్ని మాస్ పాత్రలు చేశాడు గానీ అవి అంతగా వర్కవుట్ కాలేదు. నితిన్ ఎప్పటికప్పుడు తాజా తాజాగా ఉంటూ సినిమాల మీద సినిమాలు చేస్తూ పోతుంటాడు. అలాగే తాజాగా ఇంతవరకు చేయని ఓ పాత్రను చేస్తున్నట్లు పరిశ్రమలో టాక్ నడుస్తుంది. ఆ పాత్ర ఏంటంటే.. నితిన్ పోలీస్‌గా కొత్త గెటప్ లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తుంది. అస్సలు నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కూ  కూడా ఖాకీ డ్రస్ వేయనేలేదు.

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నితిన్ పోలీస్ అవతారంలో కనిపించనున్నట్లుగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అలాంటిలాంటి పోలీస్ కాదు... అండర్ కవర్ పోలీస్.  ఎప్పుడూ అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరిగే ఓ కుర్రాడు స‌డ‌న్ గా పోలీస్ కావడ‌మన్న‌మాట‌. అంటే ఇది పక్కా పోకిరి ఫార్ములానే అనిపిస్తుంది. అన్నట్టు ఇప్పుడు అల్లు అర్జున్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేషన్ లో తెర‌కెక్కుతున్నఆ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కూడా ఇలాంటి ఫార్ములానే బేస్ చేసుకొని తెరకెక్కుతున్నట్లుగా సమాచారం. కాగా అందాల రాక్ష‌సి సినిమాతో దర్శకుడిగా వచ్చిన  హ‌ను రాఘ‌వ‌పూడి ల‌వ్ స్టోరీలు బాగా డీల్ చేయ‌గ‌ల‌డ‌ని పేరుంది. ఇప్పుడు అండర్ కవర్ పోలీస్ గా నితిన్ కనిపించినప్పటికీ ఇదీ లవ్ స్టోరీ తో బేస్ అయిన చిత్రంగానే తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ