Advertisementt

ఎన్టీఆర్ లా బన్నీ కూడా హ్యాండిస్తున్నాడా!

Tue 07th Mar 2017 09:21 PM
jr ntr,vakkantham vamsi,allu arjun,vv vinayak,khaidi no 150  ఎన్టీఆర్ లా బన్నీ కూడా హ్యాండిస్తున్నాడా!
ఎన్టీఆర్ లా బన్నీ కూడా హ్యాండిస్తున్నాడా!
Advertisement
Ads by CJ

పాపం రైటర్ వక్కంతం వంశీ కి టైమ్ కలిసి రానట్లు ఉంది. ఎప్పటి నుండో రైటర్ నుండి డైరెక్టర్ గా మారదామనుకుని వెయిట్ చేస్తున్నాడు. అయితే వంశీ కి ఒకసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. వంశీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడానికి ఒక పవర్ ఫుల్ కథని సిద్ధం చేసుకుని కూర్చున్నాడు. కానీ ఎన్టీఆర్ అవకాశం ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో ఒకింత నిరాశకు గురైన వక్కంతం.... మరో పవర్ ఫుల్ కథతో అల్లు అర్జున్ ని కలవగా ఆ కథ నచ్చి వంశీని డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం చెయ్యాలని రెడీ అయ్యాడు. ఇక వక్కంతం వంశీ కూడా  అల్లు అర్జున్ తో తియ్యబోయే సినిమా కోసం గాలిలో మెడలు కడుతూ సినిమా చెయ్యడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. ఇక ఈ సినిమా టైటిల్ కూడా 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' అంటూ ప్రచారంలోకి వచ్చేసింది. వీరి కాంబినేషన్ సినిమా దాదాపు ఓకె అయ్యి షూటింగ్ మొదలెట్టుకుంటుందనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ స్టోరీ తెర మీదకొచ్చింది.

అదేమిటంటే 'ఖైదీ నెంబర్ 150' తో చిరంజీవికి రీఎంట్రీ హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ ప్రస్తుతానికి ఏ హీరోతోనూ కమిట్ అవ్వకుండా ఖాళీగా వున్నాడు. మరి సాయిధరమ్ తేజ్ తో వినాయక్ సినిమా వుంటుందని ప్రచారం జరిగినా కూడా అది ఇప్పట్లో లేదని క్లియర్ చేసేసాడు సాయి. ఇకపోతే వినాయక్ ఒక పవర్ ఫుల్ స్టోరీ ని రెడీ చేసుకుని అల్లు అర్జున్ కి వినిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అల్లు అర్జున్.. వినాయక్ తో బద్రీనాథ్ చేసాడు. ఇప్పుడు వినాయక్ చెప్పిన మాస్ స్టోరీ నచ్చడంతో అల్లు అర్జున్, వినాయక్ కాంబినేషన్ లో చెయ్యడానికి రెడీ అయ్యాడనే వార్తలొస్తున్నాయి.

అంటే వక్కంతం వంశీ ని పక్కన పెట్టి బన్నీ, వినాయక్ కి అవకాశం ఇస్తాడా? ఏమో ఎవరు చెప్పొచ్చారు. వంశీ కథ కంటే వినాయక్ కథ బాగా నచ్చి ఉండొచ్చు అందుకే ఇలా రూటు మర్చి ఉండొచ్చు బన్నీ. ఏది ఏమైనా వక్కంత వంశీ సినిమా మొదలు పెట్టి.. షూటింగ్ జరిగితేనే అతను డైరెక్టర్ అయ్యాడంటే నమ్ముతారు గాని.... లేకుంటే వంశీ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మేలా లేరు. అయినా వంశీకి మరో హ్యాండ్ తప్పేలా లేదని అప్పుడే ప్రచారం మొదలైంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ