Advertisementt

పూరి 'రోగ్' పబ్లిసిటీ అదిరినట్లే.. !

Tue 07th Mar 2017 09:06 PM
puri jagannadh,rogue movie,audio launch,star kannada heroes  పూరి 'రోగ్' పబ్లిసిటీ అదిరినట్లే.. !
పూరి 'రోగ్' పబ్లిసిటీ అదిరినట్లే.. !
Advertisement
Ads by CJ

పూరి జగన్నాథ్ ఇషాంత్ అనే కొత్త కుర్రాడిని హీరో గా పరిచయం చేస్తూ తీస్తున్న 'రోగ్' చిత్రంపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్ గా ఇషాంత్ సరసన నటిస్తున్నారు. నిన్నగాక మొన్న 'రోగ్' టీజర్ ని విడుదల చేసిన పూరి ఇప్పుడు భారీ లెవల్లో ఆడియో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క టీజర్ తోనే 'రోగ్' తెలుగు, కన్నడ జనాలను ఆకట్టుకుందని అంటున్నారు. అయితే పూరి చిత్రం 'ఇడియట్' లా ఈ చిత్రం వుంటుందనే టాక్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్దమవుతుంది కాబట్టి ఆడియో ని త్వరలోనే విడుదల చెయ్యాలని పూరి భావిస్తున్నాడట.

సునీల్ కశ్యప్ సంగీతం అందించిన 'రోగ్' ఆడియో ని కనివిని ఎరుగని రీతిలో బెంగుళూరులో నిర్వహించాలని.... ఈ వేడుకకి స్టార్ హీరోలు కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతుంది. కన్నడ స్టార్ హీరోలైన సుదీప్, శివరాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్ లు ఈ 'రోగ్' ఆడియో వేడుకకి హాజరవుతారని సమాచారం. ఇక ఇలా కన్నడ స్టార్ హీరోలు 'రోగ్' ఆడియో కి హాజరవుతారని టాక్ స్ప్రెడ్ అవడంతో ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయని అంటున్నారు. అలాగే కావాల్సినంత పబ్లిసిటీ కూడా వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇకపోతే పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని బాలకృష్ణ కాంబినేషన్ లో చెయ్యబోతున్న విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ