నాగార్జున డీప్ డిప్రెషన్ లో ఉన్నాడని గత పది రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. దానికి కారణం అయన నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' నిరాశ పర్చడం ఒక కారణమైతే నాగ్ చిన్న కొడుకు అఖిల్ పెళ్లి రద్దు కావడం మరో కారణం. అసలు అఖిల్ పెళ్లి రద్దయిందని ఇంతవరకు అధికారిక ప్రకటన లేదుగాని.... సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ఆగడం లేదు. కానీ నాగార్జున మాత్రం ఇంతవరకు ఈ విషయమై స్పందించలేదు సరికదా కనీసం ముఖాన్ని కూడా బయటకి చూపించకుండా అజ్ఞాత వాసం గడుపుతున్నాడు. కానీ అయన భార్య అమల మాత్రం బయట ఈవెంట్స్ కి హాజరై తన పని తాను చూసుకుంటుంది. కానీ నాగ్ మాత్రం తన బిజినెస్ వ్యవహారాలకు, సినిమా షూటింగ్ కి కూడా దూరంగా గడుపుతున్నాడు.అలాగే సన్నిహితుల దగ్గర కూడా నాగ్ డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్నాడు.
అమల కూడా అఖిల్ పెళ్లి విషయాన్ని తప్ప మిగిలిన విషయాల్ని మీడియాతో పంచుకుంటూనే వుంది కానీ కొడుకు విషయమై నోరెత్తడం లేదు. నాగార్జున అయితే అఖిల్ రెండో సినిమా విషయంలో పూర్తి బాధ్యతల్ని డైరెక్టర్ విక్రమ్ కి అప్పజెప్పేసాడని అంటున్నారు. ఏ విషయంలోనూ తన జోక్యం ఉండదని మొత్తం బాధ్యతని తననే తీసుకొమ్మని అటు నాగార్జున ఇటు అఖిల్ కూడా విక్రమ్ కి చెప్పినట్లు రెండ్రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇకపోతే నాగార్జున లోపలే ఉండి ఇన్ని నడిపిస్తున్నాడు గాని తన తాజా చిత్రమైన రాజుగారి గది 2 షూటింగ్ లో కూడా పాల్గొకుండా సైలెంట్ అయిపోయాడు.
అయితే ఇలా సైలెంట్ గ ఉన్న నాగ్ మాత్రం.. ఉన్నట్టుండి ఆ సైలెంట్ ని బ్రేక్ చేస్తూ 'ది కింగ్ ఈజ్ బ్యాక్ ఇన్ బిజినెస్ విత్ రాజు గారి గది 2’ అని సోషల్ మీడియాలో తన తాజా ఫోటో తో పాటు పోస్ట్ చేసాడు. మరి ఇప్పటివరకు డిస్టబెన్స్ లో ఉన్న నాగ్ ఇప్పుడు తేరుకుని తన పనుల్లో నిమగ్నమవ్వడానికే ఇలాంటి పోస్ట్ చేసాడని అంటున్నారు. మరి పనులు మాట ఒకే గాని అఖిల్ పెళ్లి రద్దు విషయాని నాగ్ దాటవేశాడని అంటున్నారు.