Advertisementt

శృతిహాసన్ కి పవన్ కళ్యాణ్ క్లాస్..!

Tue 07th Mar 2017 08:15 PM
pawan kalyan,shruti haasan,katamarayudu,class,bollywood  శృతిహాసన్ కి పవన్ కళ్యాణ్ క్లాస్..!
శృతిహాసన్ కి పవన్ కళ్యాణ్ క్లాస్..!
Advertisement
Ads by CJ

శృతిహాసన్ ఒకప్పుడు సౌత్ లో ఐరెన్ లెగ్ గా పేరు మోసింది. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేసిన 'గబ్బర్ సింగ్' తో ఆమెకు సుడి తిరిగి ఒక్కసారే గోల్డెన్ లెగ్ గా అవతారమెత్తింది. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అడపా దడపా బాలీవుడ్లోకి వెళ్ళొచ్చినప్పటికీ ఆమెకు సౌత్ లో వున్న క్రేజ్ మరెక్కడా లేదు. ఇప్పటికే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న శృతి హాసన్ ప్రస్తుతానికి టాలీవుడ్ లో పవన్ పక్కన 'కాటమరాయుడు'లో తమిళంలో తన తండ్రి చేస్తున్న 'శభాష్ నాయుడు'లో నటిస్తోంది.

అయితే పవన్ తో 'గబ్బర్ సింగ్' సినిమా చేస్తున్నప్పుడే శృతి కి  పవన్ అంటే అభిమానం ఏర్పడిపోయిందట. ఇక ఇప్పుడు ఎలాగూ ఇద్దరు కలిసి  'కాటమరాయుడు' చేస్తున్నారు కాబట్టి ఆ స్నేహం ఇంకా గట్టిపడిందని అంటున్నారు. ఇక ఆ స్నేహంలో భాగంగానే పవన్ కళ్యాణ్.. శృతి హాసన్ కి ఒక హిత బోధ చేసాడట. అదేమిటంటే ఏదో ఒక సందర్భంలో శృతి, పవన్ తో తానూ సౌత్ లో చేసే సినిమాలు మీద ఫోకస్ తగ్గించి బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు పవన్ తో చెప్పిందట. అయితే దానికి పవన్.. శృతి కి క్లాస్ పీకినంత పని చేసాడట. బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ కాలం కెరీర్ ని కొనసాగించవచ్చని.... అదే బాలీవుడ్ లో అయితే కాంపిటీషన్ తట్టుకుని నిలబడడం మామూలు విషయం కాదని... అందుకే సౌత్ లో కెరీర్ ని బాగా మలచుకుంటే ఇక ఇబ్బంది ఉండదని చెప్పాడట.

మరి పవన్ చెప్పిన మాటలు శృతి చెవికి ఎక్కించుకుందా? లేకపోతె ఇంకా బాలీవుడ్ మోజులోనే ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. మరి పవన్ ఆమెతో ఉన్న స్నేహం తోనే ఇలా చెప్పాడని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ సౌత్ లో దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా వెలుగొందేందుకు వీలుంది కానీ.... బాలీవుడ్ లో కేవలం గ్లామర్ షో చేసినంత వరకే కెరీర్ నిలబడుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ