మనం ఏ దేశానికి వెళ్లినా, ఆ దేశ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే ఉండాలి. అలాగే మన సంప్రదాయాలను, పద్దతులను మర్చిపోకుండా ఉండాలి. ఇలా రెండింటిని సమన్వయం చేసుకుంటేనే అది ఎవరికైనా హుందాగా ఉంటుంది. ఈ విషయంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు. వారు ఏ దేశంలో వెళ్లినా కూడా అక్కడి వారి పద్దతులను, సంప్రదాయాలను గౌరవిస్తారే గానీ కించపరచరు. అయినా కూడా ఇతర దేశాలలో మన వారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీనికి అమెరికా నుండి సౌదీ వరకు ఎన్నిదేశాలనో ఉదాహరణగా చూపించవచ్చు. ఇక ఇటీవలి కాలంలో బాలీవుడ్ చిత్రాలకు ఉన్న క్రేజ్, ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ వంటి వాటిని చూసి పాకిస్తాన్‌కు చెందిన నటీనటులు మన బాలీవుడ్ చిత్రాల వైపు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్, పేరుప్రతిష్టలను చూసిన పాకిస్తాన్ నటీనటులు మన దర్శకనిర్మాతల ఇళ్ల ముందు క్యూ కడుతున్నారు. దానికి తగ్గట్టుగా అదే మతానికి చెందిన మన బాలీవుడ్ ప్రముఖులు కూడా వారికి మంచి మంచి అవకాశాలను ఇస్తున్నారు.
కానీ అలా ఇక్కడకు వచ్చిన పాకిస్తానీ నటీనటులు మాత్రం మన హీరోలను, మన సినిమాలను ఎంతో నీచంగా మాట్లాడుతుండటం ఎన్నో విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల ఓ పాకిస్తాన్ నటి బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్, ఇమ్రాన్ హష్మీలపై నీచపు వ్యాఖ్యలు చేసింది. మరలా మరోనటి.. మీ బాలీవుడ్ ఏదో అనుకున్నాను. కానీ మా లాహోర్ కేంద్రంలోని 'లాలీవుడ్' మీ కన్నా ఎన్నో రెట్లు మేలు.. బాలీవుడ్ వారికి సినిమాలు తీయడం చేతకాదు... ఇక్కడి ఆడియన్స్‌కు సినిమాలు చూడటం చేతకాదంటూ తీవ్ర పదజాలంలో కించపరిచే విధంగా మాట్లాడింది. గత కొంతకాలంగా శివసేన, విహెచ్‌పీ వంటి హిందు సంస్థలు, రాజకీయపార్టీలు పాకిస్తాన్ నటీనటులను ప్రోత్సహించవద్దని కోరుతూనే ఆందోళనలు చేస్తున్నాయి. కళలకు భాషా, ప్రాంతీయ బేధాలు లేకపోయిన, ఎదుటి వారి పద్దతులను గౌరవించడం, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. అంతేగానీ ఇక్కడకు వచ్చి మన మీదనే ద్వేషం చిమ్మేట్లు మాట్లాడటం శోచనీయం. ఈ విషయంలో మిగిలిన అదే మతానికి చెందిన ఇతర సినీ మేథావులు గానీ, ఇక్కడ స్థిరపడిన ఇతర పాకిస్తానీ నటీనటులు గానీ వారి వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా నవ్వుకోవడం ఆశ్చర్యకరమే మరి...!