అక్కినేని వారింట పెళ్ళిసందడి మొదలవ్వడం అది కాస్తా రద్దు కావడము జరిగిపోయాయి. అఖిల్ కి శ్రీయ భూపాల్ కి గత డిసెంబర్ 9 న ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి మాత్రం ఈ వేసవి మే లో జరుగుతుందని నాగ్ ఫ్యామిలీ తోపాటు జివికె ఫ్యామిలీ ప్రకటించింది. ఇక అఖిల్ పెళ్లి పనులు ఘనంగా ప్రారంభమైపోయాయి. వినాయకుడి పూజ దగ్గరనుండి... పసుపుకొట్టే కార్యక్రమం వరకు జీవీకే ఫ్యామిలీ గ్రాండ్ గా జరుపుకుంది. ఇంతలో అఖిల్ కి శ్రీయ కి విభేదాలు తలెత్తడంతో వారి పెళ్లి రద్దయిందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అసలు ఈ వార్తలను అటు జివికె ఫ్యామిలీగాని, ఇటు నాగ్ ఫ్యామిలీగాని ఖండించలేదు. అలాగని సమర్ధించలేదు. అంతా ప్రస్తుతానికి సస్పెన్సు గానే కోనసాగుతుంది.
ఇక అఖిల్ పెళ్లి రద్దు నేపథ్యంలో అఖిల్ కి శ్రీయ కి మధ్యన సయోధ్య కుదర్చడానికి స్వయంగా నాగ్ రంగంలోకి దిగినా లాభంలేకపోయిందని అంటున్నారు. దీంతో నాగ్ అప్ సెట్ అయినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. నాగార్జున ఎంతలా సర్ది చెప్పినా అఖిల్ గాని శ్రీయ గానీ ఏమాత్రం వినలేదని అందుకే ఇక ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం మొదలైంది. అయితే నాగ్ వల్ల కానిది తన వల్ల ఏమన్నా అవుతుందేమో అని రామ్ చరణ్ వైఫ్ ఉపాసన రంగంలోకి దిగిందని సమాచారం. ఉపాసనకు జివికె ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో... శ్రీయకు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఆమె చెబితే అయినా ఈ గొడవ సద్దుమణిగి పెళ్లి కి సిద్ధమవుతారని భావించి ఉపాసన... అఖిల్ కి శ్రీయ కి మధ్యన సంధి ప్రయత్నాలు చేపట్టిందని చెబుతున్నారు. ఇప్పటికే శ్రీయ భూపాల్ పెళ్లి పనులన్నిటిలో ఉపాసన పాల్గొంది.
మరి నాగ్ వల్ల కానిది ఉపాసన వల్ల అయినా సాధ్యపడి అఖిల్, శ్రీయ భూపాల్ ఇద్దరు విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్ళికి సిద్ధమయితే అక్కినేని అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ జనాలు కూడా సంతోషపడతారు. మరి చూద్దాం ఉపాసన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో!