Advertisementt

చిరు నిజంగా కుమ్మేశాడంతే!

Tue 07th Mar 2017 02:00 PM
chiranjeevi,khaidi no 150,khaidi no 150 collections  చిరు నిజంగా కుమ్మేశాడంతే!
చిరు నిజంగా కుమ్మేశాడంతే!
Advertisement
Ads by CJ

సంక్రాంతి కానుకగా విడుదలైన చిరు 150వ చిత్రం, దాదాపు దశాబ్దం తర్వాత మెగాస్టార్‌ నటిస్తున్న చిత్రమైన 'ఖైదీ నెంబర్‌ 150'పై ముందునుంచి కొన్ని అనుమానాలున్నాయి. రాజకీయంగా రాణించలేకపోయిన చిరు మరలా హీరోగా వెండితెరపై అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేయగలడా? అనే అనుమానం పలువురిని వేధించింది. కానీ ఈ చిత్రం విడుదలై సంచలన కలెక్షన్లను రాబట్టుకుంది. దీంతో ఈ చిత్రానికి 100కోట్లకు పైగా వచ్చాయని అల్లుఅరవింద్‌, వినాయక్‌లు ప్రకటించారు. కానీ ఈ చిత్రం కలెక్షన్లపై నిర్మాత చరణ్‌ స్పందించపోవడం, కొన్ని పత్రికల్లో ఈ చిత్రానికి అంత కలెక్షన్లు రాలేదని ప్రచారం జరగడంతో ఎందరిలోనో అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవలే బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం కూడా 77కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. దాంతో 'ఖైదీ' చిత్రం విషయంలో ఇంకా సందిగ్దత నెలకొంది. తాజాగా ఈ చిత్రం కలెక్షన్ల మొత్తాన్ని ప్రకటనతో బహిర్గతం చేసి, అందరి అనుమానాలకు తెరదించారు. ఈ చిత్రం 54రోజుల్లో 164 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసిందని తెలిపారు. ఇవి కేవలం థియేటర్‌ కలెక్షన్ల వివరాలు మాత్రమే. అంటే థియేటికల్‌గానే ఈ చిత్రం అంత మొత్తం వసూలు చేసిందన్న మాట. ఇక శాటిలైట్‌లు, డిజిటల్‌రైట్స్‌.. తదితరాలన్ని అదనం. ఇక ఒకే భాషల్లో ఓ సౌత్‌ ఇండియన్‌ సినిమా సాధించిన అత్యధిక కలెక్షన్లు ఇవేనని కూడా క్లారిటీ ఇచ్చారు. అదే లెక్కన తీసుకుంటే ఈ చిత్రం 104కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. ఇక 'నాన్‌ బాహుబలి' అనే కాకుండా రెండు మూడు భాషల్లో విడుదలయ్యే రజనీ, కమల్‌ వంటి వారి కలెక్షన్ల విషయంలో కన్‌ఫ్యూజన్‌కు తెరతీయకుండా, మొత్తానికి కాస్త ఆలస్యమైనా కూడా కలెక్షన్లు ప్రకటించడం ఆనందించదగిన అంశం. కానీ ఈ చిత్రానికి కలెక్షన్లను 50రోజులకు కాకుండా 54వ రోజు ప్రకటించడానికి కూడా అదే కారణమని అంటున్నారు. మొత్తానికి దటీజ్‌..మెగాస్టార్‌ అని మరోసారి చిరు ప్రూవ్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ