ప్రముఖ టాలీవుడ్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మేధావులు కూడా రావడం మొదలైంది. ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని భావజాలాలు ఉంటాయి. సమ సమాజ స్థాపనకు పనికి వచ్చే కొన్ని సైద్ధాంతిక ఆలోచనలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీపేరే జనసేన. రాబోవు సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జనసేన పార్టీలోకి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వెళ్లనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య పవన్ కళ్యాణ్, జేపీ మధ్య విస్తృతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ చర్చల్లో జనసేన పార్టీ సిద్ధాంతకర్తగా జయప్రకాష్ నారాయణ ప్రవేశం ఖాయమైందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో రెండు మార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ ప్రజల ముందు తమ సత్తాను చాటలేకపోయింది. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు లోక్ సత్తా పార్టీకి కలిసి రానివిగా అయ్యాయి. దీంతో కలత చెందిన జేపీ ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. లోక్ సత్తా పార్టీగా ఉన్నా ఇక నుండి ఆ పార్టీని ప్రజలు రాజకీయ పార్టీగా భావించే పరిస్థితులు లేవు. అందుకనే జనసేన సిద్ధాంతాలు నచ్చిన జేపీ, పవన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా జయప్రకాష్ నారాయణ్ కు, పవన్ కళ్యాణ్ కు మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే జనసేన పార్టీ సిద్ధాంతకర్తగా జయప్రకాష్ నారాయణ్ ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. పోయిన దఫా జరిగిన ఎన్నికల దెబ్బతో ఎన్నికల్లో నిలబడేందుకు కూడా ఆసక్తి చూపని జయప్రకాష్ నారాయణను ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కూడా పవన్ ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే జేపీని ఎక్కడ నుండి పోటీ చేయించాలన్న దానిపై అప్పుడే నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసినట్లు సమాచారం అందుతుంది. గోదావరి జిల్లాల్లో ఒక నియోజకవర్గం? నుండి కానీ లేదా విశాఖపట్నం నుండి ఎంపీగా గానీ జేపీని పోటీచేయించే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించిన జేపీ-పవన్ కళ్యాణ్ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరినట్లుగా తెలుస్తుంది. అదేకానీ నిజమే కాని అయితే పవన్ కు రాజకీయంగానూ, సైద్ధాంతికంగానూ బలమైన వక్త లభించినట్లేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి జేపీ జనసేనలో చేరతాడంటారా? చూద్దాం ఏం జరుగుతుందో?