Advertisementt

బాలయ్య హీరోయిన్ ఛార్మీనా..ఏంటి?!

Mon 06th Mar 2017 07:38 PM
balakrishna,puri jagannadh,charmi,charmi in puri and balayya movie  బాలయ్య హీరోయిన్ ఛార్మీనా..ఏంటి?!
బాలయ్య హీరోయిన్ ఛార్మీనా..ఏంటి?!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ పూరి, బాలకృష్ణ ని డైరెక్ట్ చేస్తున్నాడనగానే టాలీవుడ్ సినీప్రియుల దగ్గర్నుండి బాలయ్య ఫ్యాన్స్ వరకు అందరూ ఒకింత ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే పూరి మేకింగ్ అలాంటిదిమరి. మరి అలాంటి పూరి ని బాలయ్య ఎలా యాక్సెప్ట్ చేసాడో? అని అందరూ ఆశ్చర్యంతో ఆ న్యూస్ విన్నారు. మరి బాలకృష్ణ - పూరి కాంబినేషన్ లో చిత్రంపై అప్పుడే అంచనాలు స్టార్ట్ అయిపోయాయి. పూరి యమా ఫాస్ట్ గా సినిమాలు తెరకెక్కించి విడుదల చేసేస్తాడు. మరి బాలయ్య ఆ స్పీడ్ తట్టుకోగలడా? అసలు పూరి మీద ఏ నమ్మకంతో సినిమా ఒప్పుకున్నాడో? అనేది ఇప్పటికి సస్పెన్సు గానే వుంది. మరో వైపు పూరి ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టసాడని చెబుతున్నారు. 

ఇక బాలయ్య సినిమాలో నటించే హీరోయిన్స్ దగ్గర నుండి విలన్, ఇతర నటీనటులకు పూరి అప్పుడే కాస్టింగ్ కాల్ అంటూ హడావిడి చేసేస్తున్నాడు. మరి బాలయ్య సినిమాలో అందరూ కొత్త ముఖాలే కనబడతాయా? అంటే ఆ ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. ఇకపోతే పూరి తో పాటు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన హీరోయిన్ ఛార్మి, పూరి కి చెదోడువాదోడుగా పూరి ఆఫీస్ కే అతుక్కుపోయింది. ఆమె పూరి కి సంబందించిన అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ బిజీగా మారిపోయింది. ఇక ఎలాగూ హీరోయిన్ ఛాన్స్ లు కూడా రాక ఛార్మి ఇలా పూరి కాంపౌండ్ కి పరిమితమైపోయింది. 

ఇక పూరి సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లని షేర్ చేస్తూ పబ్లిసిటీ కూడా చేసేస్తున్న ఛార్మి కి బాలయ్య సినిమాలో ఒక రోల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మరి పూరి ని అంటిపెట్టుకు తిరుగుతూ ఇలా బాలకృష్ణతో చేసే ఈ చిత్రంలో ఒక పాత్ర కొట్టిసింది ఛార్మి అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఛార్మి హీరోయినా? లేకా మరేదైనా పాత్ర చేస్తుందా? అనేది తెలియాల్సి వుంది. మొత్తానికి పూరి డైరెక్షన్లో బాలయ్య నటించే చిత్రంలో ఛార్మి మాత్రం తన రోల్ కన్ఫర్మ్ చేసుకుందని ప్రచారమైతే జోరుగా జరుగుతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ