Advertisementt

స్టార్స్‌ అందరూ అదే బాటలో నడుస్తున్నారా?

Sun 05th Mar 2017 08:48 PM
star heroes,route,pre release event,jr ntr  స్టార్స్‌ అందరూ అదే బాటలో నడుస్తున్నారా?
స్టార్స్‌ అందరూ అదే బాటలో నడుస్తున్నారా?
Advertisement
Ads by CJ

ఒక స్టార్‌ ఒక విషయంలో ఓ విభిన్న పంథాను అనుసరిస్తే వాటిని మిగిలిన వారు కూడా ఫాలో అవుతుంటారు. కాగా ఇటీవల ఆడియో వేడుకలను జరపకుండా ఒక్కో పాటను విడుదల చేస్తూ, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను మాత్రం ఘనంగా జరిపే సంప్రదాయం మొదలైంది. 'సరైనోడు, ధృవ, ఖైదీ నెంబర్‌150, విన్నర్‌, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి చిత్రాలన్నీ అదే రూటులో వెళ్లాయి. ఇక రాబోయే 'గురు' నుంచి అందరు హీరోలు ఇదే బాగుందనే ఐడియాతో అలాగే చేయాలని డిసైడ్‌ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఇటీవల మన దర్శకులు స్టార్స్‌ విషయంలో ఓ వింత నిర్ణయం తీసుకుంటున్నారు. చిత్రం స్క్రిప్ట్‌ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను ప్రారంభించేస్తున్నారు. లుక్‌, గెటప్‌ వంటి విషయాలలో, లేక ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్న స్టార్స్‌ను తొందరపెట్టకుండా వారితో సంబంధం లేని సీన్స్‌ను షూట్‌ చేస్తూ షెడ్యూల్స్‌ ముగిస్తున్నారు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, ధృవ' వంటి చిత్రాలలో పవన్‌, చరణ్‌లు లేటుగా జాయిన్‌ అయ్యారు. ఇక తాజాగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటిస్తున్న 'డిజె' షూటింగ్‌లోకి కూడా బన్నీ లేటుగా ఎంటర్‌ అయ్యాడు. మురుగదాస్‌ చిత్రంలో మహేష్‌ కూడా అలాగే చేశాడు. కాగా 'సర్దార్‌' చిత్రంలో పవన్‌ విషయంలో ఇదే చేసిన దర్శకుడు బాబి తాజాగా ఎన్టీఆర్‌తో చేసే చిత్రం షూటింగ్‌ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. కానీ షూటింగ్‌లో యంగ్‌టైగర్‌ ఇంకా పాల్గొనలేదు. కాగా రెండో షెడ్యూల్‌ను ఈ నెల 5 నుంచి ప్రారంభించనున్నారు. ఇక ఈ షెడ్యూల్‌ మొదలైన తర్వాత కూడా ఓ ఐదురోజుల గ్యాప్‌ తీసుకుని యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మేకప్‌ వేసుకోనుండటం విశేషంగా చెప్పుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ