టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు మురుగదాస్ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ అయిపోవచ్చింది... అయిపోయింది... అనే మాటలే కానీ ఇప్పటికీ చిత్రం షూటింగ్ కొనసాగు..తూనే ఉంది. ఇక ఈ చిత్రం ద్వారా మహేష్ కోలీవుడ్‌కు కూడా డైరెక్ట్‌గా పరిచయం కానుండటంతో ఆమాత్రం జాగ్రత్తలు అవసరమే. మరోవైపు ఏదో మొక్కుబడిగా కాకుండా తెలుగు, తమిళ వెర్షన్‌లలో పలువురు అదే భాషా నటులు నటిస్తుండటం కూడా ఆలస్యానికి మరోకారణం. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 100కోట్ల భారీ బడ్జెట్‌తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. ఇటీవలే హీరో మహేష్‌పై వచ్చే ఇంట్రడక్షన్ సీన్స్‌ను ముంబైలో చిత్రీకరించారు. ఆ తర్వాత పూణెలో కొద్ది రోజులు షూటింగ్ జరుగుతుంది. ఇక క్లైమాక్స్ సీన్స్‌ను బ్యాంకాక్ లో తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని జూన్23న రిలీజ్ చేయనున్నట్లు ఆల్‌రెడీ మురుగదాస్ ట్వీట్ ద్వారా అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం టైటిల్‌ను గానీ, ఫస్ట్‌లుక్‌ని కానీ విడుదల చేయకపోవడంతో మహేష్ అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.
ఈ చిత్రం టైటిల్ విషయంలో పలు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషలకు ఒకే టైటిల్‌ను, అందునా తమిళ భాషలో కూడా మంచి అర్ధమున్న టైటిల్‌ను వెతికే పనిలో పడ్డారు. ఎందుకంటే తమిళనాడులో అక్కడి తమిళంలో టైటిల్ పెడితేనే అక్కడ పలు రాయితీలు లభిస్తాయి. ఈ చిత్రానికి గాను 'సంభవామి, ఏజెంట్ శివ.. ' వంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇక తాజాగా 'మర్మం' అనే టైటిల్ కూడా హల్‌చల్ చేస్తోంది. కానీ ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్‌ను పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. దీనికి తెలుగు, తమిళ, సంస్కృతభాషలో కూడా అర్ధం ఒకటే కావడం ప్లస్ కానుంది. ఇక ఈ చిత్రం టైటిల్‌ను 'సంభవామి యుగే యుగే' అని ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌లో ఓ నిర్మాత మాట జారిన విషయం తెలిసిందే. కాగా 'సంభవామి యుగే.. యుగే' పేరుతో ఆమధ్యనే ఒక చిత్రం వచ్చింది. దీంతో అధికారికంగా అతి తక్కువ వ్యవధిలోనే అదే టైటిల్‌ను మరలా రిపీట్ చేయవచ్చా? ఏమైనా అడ్డంకులు వస్తాయా? అనే ఆలోచనలో యూనిట్ ఉంది. గతంలో మహేష్ నటించిన 'ఖలేజా' చిత్రం టైటిల్ విషయంలో కూడా పలు వివాదాలు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం టైటిల్‌పై కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను ఉగాదికి విడుదల చేసి, మహేష్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినోత్సవం విషయంలో మహేష్‌కు ఉన్న సెంటిమెంట్‌ను ఫాలో అయి, మే 31న హారీస్‌జైరాజ్ అందించిన ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.