Advertisementt

ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది..!

Sun 05th Mar 2017 07:58 PM
prabhas,bahubali,sujith movie,top technicians  ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది..!
ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది..!
Advertisement
Ads by CJ

'బాహుబలి' చిత్రంతో దేశ, విదేశాలలో కూడా పాపులారిటీ సంపాదించుకున్న హీమ్యాన్‌ ప్రభాస్‌. కాగా ఏప్రిల్‌ 28న విడుదల కానున్న 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌'తో ఆయన క్రేజ్‌ దేశవ్యాప్తంగా మరింతగా పెరగడం ఖాయంగా చెప్పవచ్చు. దీంతో తనకు అన్ని భాషలలో వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభాస్‌ తన తదుపరి చిత్రాన్ని తన సొంతబేనర్‌ వంటి యూవీ క్రియేషన్స్‌లో సుజీత్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. పెరిగిన ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రానికి ఏకంగా 150కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌ను హాలీవుడ్‌ స్థాయిలో ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. అందుకోసం మాస్టర్‌ కెన్నీబెట్స్‌ అనే హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ని తేనున్నారు. ఇక ఈ చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌ కోసం ఏకంగా 40 నుంచి 50కోట్లు కేటాయించాలని నిర్ణయించారట. ముఖ్యంగా ఇందులో వచ్చే ఓ 20 నిమిషాల కార్స్‌ ఛేజింగ్‌ సీన్స్‌కు భారీ మొత్తంలో బడ్జెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి బాలీవుడ్‌లో కూడా గుర్తింపు ఉన్న సినిమాటోగ్రాఫర్‌గా మది, డిజైనర్‌గా సాబుసిరిల్‌లు పనిచేస్తుండగా, బాలీవుడ్‌ సంగీత త్రయం శంకర్‌-ఇహసాన్‌-లాయ్‌లు స్వరాలు అందించనున్నారు. సో.. ఈ చిత్రంలో ఎక్కువగా బాలీవుడ్‌ వారికి పరిచయం ఉన్న టెక్నీషియన్స్‌కే పెద్ద పీట వేస్తున్నట్లు అర్థమవుతోంది. మరో పక్క ప్రభాస్‌కు జోడీగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ డేట్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఇందులోని కీలకమైన నెగటివ్‌ రోల్స్‌కు కూడా బాలీవుడ్‌ నటులను ఎంపిక చేయనుండటం విశేషం. మెయిన్‌ నెగటివ్‌ పాత్రకు వివేక్‌ ఓబేరాయ్‌ను తీసుకోనున్నారు. వర్మ స్కూల్‌ నుండి వచ్చిన వివేక్‌ 'రక్తచరిత్ర'లో పరిటాల పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. మరో కీలకపాత్రకు వెటరన్‌ హీరో జాకీష్రాఫ్‌ని తీసుకోనున్నారని తెలుస్తోంది. 'హీరో' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన జాకీ ఆమధ్య రెండు మూడు తెలుగు చిత్రాలలో కూడా నటించాడు. మొత్తానికి సుజీత్‌ సినిమా కోసం ప్రభాస్‌ అండ్‌ టీం బాగా వర్క్‌ చేస్తున్నారని ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ