ఇప్పుడు మీడియాలో ఏదన్నా హాట్ టాపిక్ ఉందా.. అంటే అది సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుండి లీక్ అయిన కోలీవుడ్ హీరోల పర్సనల్ ఫొటోస్ గురుంచే. ఒక్క కోలీవుడ్ హీరోల పర్సనల్ మాత్రమే కాకుండా ఇటు టాలీవుడ్ లో హీరో రానా పర్సనల్ పిక్స్ ని కూడా పోస్ట్ చేసి సదరు హీరో, హీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది సింగర్ సుచిత్ర. కొన్ని రోజుల క్రితం ధనుష్ చిత్ర బృందం తనతో అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పినా.... ధనుష్ ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ధనుష్ మీద కోపంతో సుచిత్రం... ధనుష్, త్రిష కలిసి ఉన్న ప్రెవేట్ ఆల్బమ్ ఫొటోస్ ని ట్విట్టర్ లో లీక్ చేసింది. అంతటితో ఆగకుండా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, శింబు హీరోయిన్స్ తో ప్రవేట్ పార్టీ లలో ఎలా బిహేవ్ చేస్తారో కూడా లీక్ చేసి సంచలనాలకు తెర తీసింది. ఏదో తమిళ హీరోలమీద పగ ఉంటే వుండొచ్చుగాని పాపం మధ్యలో రానా ఏం చేసాడో రానా, త్రిష కి ముద్దుపెడుతున్న ఫోటో ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసి సుచి లీక్స్ సెగ టాలీవుడ్ ని తాకేలా చేసింది. ఇది ఇంతటితో అవ్వలేదని త్వరలోనే మరిన్ని లీక్స్ బయటపెడతానిని చెప్పి హీరోలకు, హీరోయిన్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
అయితే సుచిత్ర ఇదంతా చెయ్యడానికి కేవలం ధనుష్ మీద ఉన్న పగ మాత్రమే కాదట. సుచిత్రకి హీరోలకు మధ్యన ఈ మధ్యన కోల్డ్ వార్ నడుస్తుండడంతో ఆమెను ప్రవేట్ పార్టీలకు దూరం పెట్టడం వలన ఆగ్రహించిన సుచిత్ర ఇలా తనదగ్గర వున్న ప్రవేట్ పిక్స్ తో వారిపై ప్రతీకారం తీర్చుకుంటుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. కేవలం ఆ కారణంతోనే సుచిత్ర ఇలా చేస్తుందని చెబుతున్నారు. అయితే సుచిత్ర మాత్రం తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని తన ట్విట్టర్ ని ఎవరు ఫాలో అవ్వొద్దని... తన దగ్గర ఏ హీరోల పర్సనల్ ఫొటోస్ లేవని చెబుతుంది. మరోపక్క సుచి భర్త కార్తీక్ కూడా తన భార్య ట్విట్టర్ ఎవరో హ్యాక్ చేశారని ఆ ఫోటోలకు తనకి ఏ సంబంధం లేదని చెబుతూనే .....తన భార్య మానసిక పరిస్థితి ఏం బాగోలేదని.... ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెబుతున్నాడు. అంటే కార్తీక్ ఈ ఫోటోలను తన భార్య మానసిక పరిస్థితి బాగోకే ట్విట్టర్ లో పోస్ట్ చేసిందని చెబుతున్నాడా? ఏమో తెలియదు గాని పోలీసులు కూడా సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన వారిని పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇకపోతే ఆయా హీరోలనుండి సుచిత్రకి మాత్రం త్రెడ్నింగ్ కాల్స్ వస్తున్నాయట. అసలు ఈ వ్యవహారం ఎటుపోయి ఎటు వస్తుందో అని సదరు హీరో, హీరోయిన్స్ మాత్రం తెగ వర్రీ అవుతున్నారట.