'అలియాస్ జానకి' చిత్రానికి గాను దర్శకునిగా దయానంద్‌రెడ్డికి నంది అవార్డు వచ్చింది. దయా కె. మొదట నటునిగా మారడానికి ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత పవన్ అండతో ఆయన 'జానీ' చిత్రం నుంచి 'పంజా' వరకు అనేక చిత్రాల్లో నటించాడు. ఆయనలోని టాలెంట్‌ను చూసిన పవన్ ఆయనకు తన పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో ఎంతో కాలం అవకాశం ఇచ్చాడు. ఇక నటన కంటే దర్శకత్వం మీద ఫోకస్ పెట్టమని దయాకు పవన్ సలహా ఇచ్చాడు. అలా పవన్ వద్ద ఆయన బేనర్‌లోనే 12 ఏళ్లు దర్శకత్వ విభాగంలోనే పనిచేసి, ఆయన నటించిన చిత్రాలన్నింటిలో వేషాలు వేశాడు. ఇక ఎ.యం.రత్నం నిర్మాతగా పవన్ చేయాల్సిన 'సత్యాగ్రహి' చిత్రానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. పొలిటికల్ సెటైర్ ఫిల్మ్‌గా దానిని రూపొందించడానికి ఎన్నో రీసెర్చ్‌లు చేసి వర్క్ చేశాడు.ఇక ఆ సినిమా ఆగిపోయిన తర్వాత 'అన్నవరం'తో పాటు 'జల్సా' వరకు దర్శకత్వం, నటన రెండింటిలోనూ అవకాశాలు పొందుతూ వచ్చాడు. ప్రవీణ్‌గాంధీ దర్శకత్వంలో వచ్చిన 'గాయం2'కి కోడైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక 'పంజా' సమయంలో పవన్ వల్ల ఆ చిత్ర నిర్మాతలకు, 'గాయం2' నిర్మాతలకు చేరువయ్యాడు. ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి మూడు చిన్న చిత్రాలను నిర్మించాలని భావించి, 'అలియాస్ జానకి' ద్వారా దయా కె.కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈచిత్రానికి గాను ఆయనకు నంది అవార్డు వచ్చింది. కానీ ఈ అవార్డులను ప్రకటించడంలో ఆలస్యం కారణంగా ఆయనకు అంత మంచి సినిమా తీసినప్పటికీ ఫ్లాప్‌డైరెక్టర్ అనే ముద్రతో కెరీర్ ముందుకు సాగలేదు. పాపం.. తాను చేయని పాపానికి ఆయనకు శిక్ష వేశారు. ఇక నంది అవార్డు తర్వాత ఎందరి నుంచో ఫోన్లు, అభినందనలు వస్తున్నాయని తెలిపిన ఆయన తాజాగా పవన్‌ని 'కాటమరాయుడు' సెట్లో కలిసి, ఆయనతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. వీలైనప్పుడు పవన్‌కి తన చిత్రాన్ని స్పెషల్ షో వేసి చూపించాలని ఆశపడుతున్నాడట.