Advertisementt

మెగాఫ్యాన్స్‌ ఆశలన్నీ ఆ చిత్రంపైనే..!

Sun 05th Mar 2017 04:02 PM
megastar amitabh bachchan,big b,sarkar 3,ram gopal varma  మెగాఫ్యాన్స్‌ ఆశలన్నీ ఆ చిత్రంపైనే..!
మెగాఫ్యాన్స్‌ ఆశలన్నీ ఆ చిత్రంపైనే..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి, బాద్‌షా.. ఇలా ఎన్నో బిరుదులున్న స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌. సినిమాలపై ఉన్న ప్రేమ, అనురక్తితో తన తుదిశ్వాస వరకు నటించాలనేది ఆయన అభిలాష. అందుకే ఈ వయసులో కూడా ఆయన వరుస చిత్రాలు చేస్తున్నాడు. విభిన్నకాన్సెప్ట్‌ చిత్రాలతో పాటు అన్నిరకాల పాత్రలు చేస్తున్నాడు. ఆయన ఇంతలా స్టార్‌గా ఎదిగేందుకు ఆయన గంభీరమైన కంఠం, కేవలం కంటి చూపులలోనే ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించే ప్రతిభ వల్లే ఆయనకు స్టార్‌డమ్‌తో పాటు యంగ్రీమేన్‌ అనే బిరుదు కూడా వచ్చింది. కాగా ఆయన వర్మతో గతంలో పలు చిత్రాలు చేశాడు. వీటిల్లో 'సర్కార్‌, సర్కారాజ్‌'లు సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం అదే సీరిస్‌లో వస్తున్న 'సర్కార్‌3'పై కూడా ఎన్నో అంచనాలు ఏర్పడుతున్నాయి. 

ఈ చిత్రంలో తమ మెగాహీరోను మరోసారి యాంగ్రీమేన్‌గా చూడాలని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లతో పాటు విడుదలైన పోస్టర్స్‌ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌ వరకు ఈ చిత్రం సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. అందరిలో ఆసక్తిని రేపుతోంది. కాగా గత కొంత కాలంగా వర్మ పల్లీల పొట్లాలు కట్టినట్టుగా, టెక్నాలజీ, లోబడ్జెట్‌ పేరుతో టాలీవుడ్‌లో వరుస చిత్రాలు తీశాడు. వీటి ద్వారా అసలు వర్మ అంటేనే గౌరవం పోయింది. ఒకప్పుడు ఆయన పేరును చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఆయన నేటి చిత్రాలను లైట్‌గా తీసుకుంటున్నారు. మధ్యలో వచ్చిన 'రక్తచరిత్ర-పార్ట్‌1, కిల్లింగ్‌ వీరప్పన్‌, వంగవీటి' చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. కానీ అవి కూడా వర్మ స్థాయి చిత్రాలు కాదు...! ఇక 'సర్కార్‌3' చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే మాత్రం ఈ సినిమాను వర్మ కాస్త మనసు పెట్టి తీశాడనిపిస్తోంది. బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తు చేస్తున్న ఈ చిత్రం అక్కడ కూడా ఆడకపోతే, మరలా ఆయన టాలీవుడ్‌కి వచ్చి తన కెరీర్‌ను జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే. ఇక 'న్యూక్లియర్‌' నుండి 'శశికళ' వరకు అన్ని సైడైపోవడం ఖాయం. దీంతో ఈ చిత్రంపై వర్మతో పాటు మెగాస్టార్‌ అభిమానులు కూడా ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌7వ తేదీన విడుదల కానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ