హీరోగా రవితేజ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఫుల్ ఎనర్జీ తో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యన వచ్చిన ప్లాప్ ల వల్ల కొద్దిగా డీలా పడ్డ రవితేజ మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుని ఏక కాలంలో రెండు సినిమాలను లైన్ లో పెట్టేసాడు. డైరెక్టర్ విక్రమ్ సిరికొండ తో 'టచ్ చేసి చూడు' సినిమాని మొదలెట్టిన రవితేజ.... 'రాజా ది గ్రేట్' సినిమా ని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మొదలు పెట్టి తనలో జోష్ తగ్గలేదని చెబుతున్నాడు. మరి ఏకకాలంలో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ పై ఇన్నర్ సర్కిల్స్ లో ఒక పుకారు షికారు చేస్తుంది.
ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత రవితేజ ఇక సినిమాల్లో నటించడని అంటున్నారు. అయితే రవితేజ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే రవితేజ ఈ మధ్యన ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో చేసిన సినిమాలన్నీ సరైన విజయాన్ని అందించకపోవడంతో రవితేజ నటనకు గుడ్ బై చెప్పబోతున్నాడనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇక నటనకు గుడ్ బై చెప్పినా కూడా రవితేజ ఇండస్ట్రీలోనే ఉంటాడట. అయితే రవితేజ నటనకు బై చెప్పేసి డైరెక్షన్ మీద కన్నేశాడని చెబుతున్నారు. రవితేజ కు ఇంతకుముందే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అనుభవం ఉండడంతో ఇలాంటి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
రవితేజ హీరో కాకముందు నుండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చెయ్యడం వలన ఇక హీరోగా ఎలాగు పెద్దగా సక్సెస్ లు రాకపోవడంతో రవితేజ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.