ఏప్రిల్ 28న విడుదల కానున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్'పై ఎంతటి అంచనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా రోజు రోజుకి క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రం ద్వారా ప్రభాస్, రానా, అనుష్కలకు దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ లభించింది. దీంతో ఈ సెకండ్ పార్ట్‌ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ చిత్రాన్ని వాడుకోవాలని ప్రభాస్‌తో పాటు రానా, అనుష్కలు కూడా డిసైడ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. 'బాహుబలి-ది కన్‌క్లూజన్'తో పాటు ప్రభాస్ తదుపరి నటించనున్న సుజీత్ చిత్రంలోని టీజర్‌కు సంబంధించిన పనులను, షూటింగ్ వర్క్‌ను పూర్తి చేసి 'బాహుబలి-2' చిత్రంతో పాటు ఈ టీజర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక అదే సమయంలో అనుష్క ప్రస్తుతం 'పిల్లజమీందార్' ఫేమ్ అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం గ్రాఫికల్ హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లోనే ప్రస్తుతం అనుష్క బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని కూడా మే చివరి వారంలో గానీ జూన్ మొదటివారంలో గానీ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను కూడా 'బాహుబలి-2' చిత్రం ప్రదర్శించే థియేటర్‌లో ప్రదర్శించాలని నిర్ణయించారట. ఇక ఈ ప్రభాస్-సుజీత్‌ల చిత్రంతో పాటు 'భాగమతి' చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మిస్తుండటం విశేషం.
మరోపక్క ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం విడుదలయ్యే ధియేటర్లలో రానా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో నటిస్తున్న 'నేనే రాజు... నేనే మంత్రి' చిత్రం టీజర్‌ను కూడా రిలీజ్ చేయడానికి సురేష్‌బాబు ప్లాన్ చేసి రాజమౌళి, ఆర్కా మీడియా వారి అనుమతిని తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బహుశా ఈ విషయంలో 'బాహుబలి-ది కన్‌క్లూజన్' టీం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవచ్చనే తెలుస్తోంది.