Advertisementt

కాటమరాయుడు ఫిక్సయితే... అంతే..!

Sat 04th Mar 2017 01:57 PM
pawan kalyan,katamarayudu  కాటమరాయుడు ఫిక్సయితే... అంతే..!
కాటమరాయుడు ఫిక్సయితే... అంతే..!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సాధారణంగా ఓ విషయంపై ఎప్పుడు తొందరగా ఫిక్స్‌కాడు. అయ్యాడంటే.. దాని అంతు చూడందే వదలడు. అది సినిమాలైనా.. రాజకీయాలైనా అంతే...! ఇక ప్రస్తుతం 'కాటమరాయుడు'లో ఆయన బిజీ బిజీగా ఉన్నాడు. పవన్‌ ఈమధ్య కాస్త రాజకీయాలలో బిజీ కావడంతో ఈ చిత్రం అనుకున్న తేదీకే విడుదలవుందా? లేదా? అనే సందేహాలను ఆయన పటాపంచలు చేస్తున్నాడు. ఒక వైపు సాంగ్స్‌ పిక్చరైజేషన్‌, మరోవైపు ప్యాచ్‌వర్క్‌, ఇంకో వైపు డబ్బింగ్‌ ఇలా నిమిషం కూడా గ్యాప్‌ లేకుండా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఆయన 50శాతానికిపైగా డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశాడు. ఇక నిన్నటితో టైటిల్‌సాంగ్‌ చిత్రీకరణ పూర్తయింది. 400మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లలో హైదరాబాద్‌లో స్పెషల్‌గా వేసిన సెట్‌లో దీని చిత్రీకరణ జరిపారు. ఈ రోజు యూనిట్‌ ఫారిన్‌కు వెళ్తోంది. అక్కడ వారం రోజుల్లో ఏకంగా రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను, రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేశారు. ఇక సమ్మర్‌సీజన్‌లో రానున్న మొట్ట మొదటి భారీ అండ్‌ స్టార్‌ చిత్రమిదే కావడం విశేషం. ఇక టైటిల్‌సాంగ్‌ విడుదలైంది. ఈ చిత్రం టీజర్‌ ఎంతగా సంచలనం సృష్టిస్తోందో.. ఈ టైటిల్‌సాంగ్‌ సైతం అదే రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ పాటకు అనూప్‌రూబెన్స్‌, రామజోగయ్యశాస్త్రిలు అద్భుతమైన స్వరాలను, సాహిత్యాన్ని అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ