కాజల్ అగర్వాల్ దాదాపు దశాబ్దకాలం తెలుగు తెరమీద తన హవా కొనసాగించింది. అయితే ఈ మధ్యన ఆమెకు అవకాశాలు తగ్గు మొఖం పట్టాయి. ఇక కాజల్ కి కష్టకాలం మొదలైంది అనుకునే లోపు 'ఖైదీ నెంబర్ 150' లో ఆఫర్ ఇచ్చి చరణ్ ఆమెకు హెల్ప్ చేసాడు. ఇక మళ్ళీ కాజల్ తన హవాని టాలీవుడ్ లో కొనసాగిద్దామని ....మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుని బిజీ అవుదామని కలలు కంటూ కూర్చుంది. కానీ మళ్ళీ ఆమెకు టాలీవుడ్ నుండి మొండి చెయ్యే ఎదురైంది. ఇక ఇలా అవకాశాలు గురించి ఎదురు చూస్తూ కూర్చుంటే కుదరనుకుంది కాబోలు ఇప్పుడు కాజల్ ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రంలో చెయ్యడానికి ఒప్పుకుందని ప్రచారం మొదలైంది. అంతే కాకుండా ఇప్పుడు కాజల్ పెళ్లి గురించి కూడా ఆలోచిస్తుందని టాక్.
ఇప్పటికే కాజల్ ఒక బిజినెస్ మ్యాన్‌తో డీప్ లవ్ లో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక త్వరలోనే కాజల్ పెళ్లిపీటలెక్కుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ కాజల్ మాత్రం ఇంకా కెరీర్ అంటూ పెళ్లి వైపు అడుగులు వెయ్యకుండా కూర్చుంది. ఇక ఇప్పుడు ఆఫర్స్ రావడం ఎలాగూ తగ్గాయి కాబట్టి ఇప్పుడు పెళ్లి ఆలోచన చేస్తుందని అంటున్నారు. అసలు ఇప్పటికే కాజల్ తో పాటు ఇండస్ట్రీలోకొచ్చిన సమంత పెళ్ళికి సిద్దపడగా.... అనుష్క కూడా పెళ్లి గురించి ఆలోచిండంతో కాజల్ కూడా పెళ్లి గురించి ఆలోచన చేస్తుందని గుసగుసలు వినబడుతున్నాయి.