Advertisementt

పూరీలో నో మార్పు..బాలయ్యని ఏం చేస్తాడో..?

Fri 03rd Mar 2017 07:12 PM
puri jagannadh,balakrishna,venkatesh,puri jagannadh movies  పూరీలో నో మార్పు..బాలయ్యని ఏం చేస్తాడో..?
పూరీలో నో మార్పు..బాలయ్యని ఏం చేస్తాడో..?
Advertisement
Ads by CJ

బాలయ్యతో 101వ చిత్రం అవకాశం దక్కించుకున్న పూరీ అదృష్టాన్ని చూసి అందరూ మరలా పడి లేచాడు.. అని మెచ్చుకున్నారు. ఇక నుంచైనా పూరీ కథల నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ పూరీ వ్యవహారం చూస్తుంటే ఆయన ఇంకా మారలేదనే అనుమానం వస్తోంది. చార్మిని వదలకపోవడం, బాలయ్య చిత్రానికి కొత్త వారికోసం ప్రకటన చేయడంతో పాటు ఆయనపై ఇప్పుడు కొత్త విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం పూరీ.. ఇషాన్‌ అనే హీరోను డెబ్యూ చేయిస్తూ కన్నడ, తెలుగు భాషల్లో భారీగా రూపొందుతున్న 'రోగ్‌' చిత్రాన్ని విడుదలకు రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం అఫీషియల్‌ టీజర్‌ కూడా రిలీజ్‌ అయింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసే బిజీలో పూరీ ఉన్నాడు. ఇక ఈనెల 9న బాలయ్య చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి సెప్టెంబర్‌29న రిలీజ్‌ చేస్తామని కూడా అనౌన్స్‌ చేశాడు. 

కాగా పూరి మరో సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నాడని, ఇప్పటికే కథ విషయంలో కూర్చున్నాడని వార్తలు వస్తున్నాయి. అంటే ఒకే సమయంలో ఆయన 'రోగ్‌' పోస్ట్‌ ప్రొడక్షన్, రిలీజ్‌ పనులను, బాలయ్య మూవీ స్క్రిప్ట్‌ను, ప్రీ ప్రొడక్షన్‌ పనులను చూస్తూనే మరో వైపు వెంకీ చిత్రం కథ విషయంలో కుస్తీలు పడుతున్నాడనే వార్త వింటే ఇంకా పూరీ మారలేదా? అనే అనుమానం అందరికీ వస్తోంది. ఇప్పటికే ఇలా చేసి పలు సార్లు దెబ్బతిన్న పూరీ ఇప్పటికీ తన శైలిని మార్చుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా విక్టరీ వెంకటేష్‌ చిత్రం విషయంలో ఇంకా అధికారిక సమాచారం ప్రకటించాల్సి వుంది. అదే జరిగితే పూరీ ఇంకా మారలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ