Advertisementt

అంత పవర్ ఫుల్ కాదు..కామెడీ పోలీసే..!

Fri 03rd Mar 2017 07:01 PM
sharwanand,radha,sharwanand movie radha teaser talk  అంత పవర్ ఫుల్ కాదు..కామెడీ పోలీసే..!
అంత పవర్ ఫుల్ కాదు..కామెడీ పోలీసే..!
Advertisement
Ads by CJ

శర్వానంద్‌ ఇప్పటివరకు 25 చిత్రాలు చేశాడు. ఆయనకు మొదటి నుంచి మంచి నటునిగా పేరైతే వచ్చింది గానీ సక్సెస్‌లు మాత్రం రాలేదు. కానీ గత నాలుగైదు చిత్రాలుగా ఆయన కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ రూట్‌ను తెలుసుకున్నాడు. ఇప్పటికే 'రన్‌ రాజా రన్‌, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి'లతో నాలుగు హిట్లు కొట్టాడు. సక్సెస్‌ఫుల్‌ హీరోగా దూసుకెళ్తున్నాడు. క్లాస్‌ని, అదే సమయంలో మాస్‌ని మెప్పించడం ఎలాగో నేర్చుకున్నాడు. ఇక తాజాగా శర్వానంద్‌ నటిస్తున్న 25వ చిత్రంగా 'రాధ' రూపొందుతోంది. ఇందులో శర్వా ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని వార్తలు వస్తునే ఉన్నాయి. చంద్రమోహన్‌ వంటి కొత్త దర్శకునితో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వంటి భారీ నిర్మాతతో ఈ చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శర్వానంద్‌ ఓ సాయికుమార్‌లాగా, ఓ రాజశేఖర్‌లాగా పవర్‌ఫుల్‌గా ఇరగదీస్తాడేమోనని ఎందరో భావించారు.

కానీ చిత్రం ఫస్ట్‌లుక్‌, తాజాగా విడుదలైన టీజర్ని చూస్తే ఆయన నేటి ఫార్ములాకు అనుగుణంగా, పవన్‌ 'గబ్బర్‌సింగ్‌' తరహాలో కామెడీ పోలీస్‌గా కితకితలు పెట్టనున్నాడని స్పష్టమవుతోంది. తన కామెడీతో, రౌడీలను ఇరగదీస్తూ కనిపించాడు. పట్టిందల్లా బంగారమే అన్న తరహాలో తన రేంజ్‌ను మరింతగా పెంచుకునేలా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్నట్లుగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ సమ్మర్‌లో మళ్లీ పెద్ద సినిమాలతో పోటీకి సిద్దమవుతూ, తన గట్స్‌ని మరోసారి ప్రూవ్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాగా ఈ చిత్రంలో శర్వా సరసన గోల్డెన్‌లెగ్‌గా పేరు తెచ్చుకుంటున్న లావణ్య త్రిపాఠి నటిస్తోంది. మరి ఈ చిలిపి పోలీస్‌ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ