రాంగోపాల్ వర్మ.. ఎంతోకాలంగా ఆయన దర్శకునిగా చేతల్లో సత్తా చూపలేక.. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక 'వంగవీటి' ఆడియో వేడుకలో తన నుంచి ఇక మంచి చిత్రాలు వస్తాయని తెలిపాడు. మరోపక్క ఇక మెగా ఫ్యామిలీని, మెగాభిమానులను టార్గెట్ చేయనని, వారికి ఓ సందర్భంలో ఆల్‌ది బెస్ట్ కూడా చెప్పాడు. ఇక ప్రస్తుతం వర్మ తనకి కలిసొచ్చిన 'సర్కార్' సిరీస్‌లో భాగంగా 'సర్కార్3'ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్7న విడుదల చేయనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రాన్ని సంబంధించి విడుదలైన లుక్స్, అమితాబ్ మొహకవళికలు వంటివి అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వర్మ 'సర్కార్3'ని ప్రమోషన్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈచిత్రం శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే జీవితం ఆధారంగా, 'గాడ్‌ఫాదర్' తరహాలో తెరకెక్కుతోందని అందరికీ అర్ధమవుతోంది. ఇప్పటికే వర్మ అమితాబ్‌తో 'సర్కార్' సిరీస్‌తో పాటు 'నిశ్శబ్ద్, వర్మ కీ ఆగ్' చిత్రాలను తీశాడు. 'సర్కార్' సిరీస్ తప్పితే మిగిలినవి డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో బిగ్‌బి అమితాబ్ వర్మను దూరంగా ఉంచాడని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా ఏదో విధంగా వర్మ మరలా అమితాబ్‌ను ఒప్పించి, మరలా బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తు 'సర్కార్3' చిత్రం చేస్తున్నాడు. కాగా ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, తాను 'సర్కార్' తప్ప బిగ్‌బితో మంచిచిత్రాలు చేయలేకపోయానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని వ్యాఖ్యానించాడు. ఇక తన నుంచి మంచి చిత్రాలు వస్తాయని హామీ ఇచ్చాడు. గతంలో వర్మ నా సినిమాలు నా ఇష్టం.. ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే లేదు.. నేనేమీ ఎవ్వరినీ నాచిత్రాలు చూడమని బలవంతం చేయడం లేదు.. అని వ్యాఖ్యానించాడు. మరోసారి తనకు మాట మీద నిలబడే మనస్తత్వం లేదని, తన మనస్తత్వం పరిస్థితులను బట్టి మారుతుందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే వర్మ చెప్పిన మాటలు నమ్మబుద్ది వేయడం లేదు. ఆయన 'సర్కార్3' చిత్రంలో ప్రమోషన్, బిజినెస్‌లో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఈ చిత్రం ప్రమోషన్‌కు, ఓపెనింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.