Advertisementt

బాబు నిప్పు... అంటోన్న జేసీ..!

Fri 03rd Mar 2017 06:28 PM
jc.diwakar reddy,chandrababu naidu,diwakar travels,bus accident  బాబు నిప్పు... అంటోన్న జేసీ..!
బాబు నిప్పు... అంటోన్న జేసీ..!
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన గురించి లోకానికి  తను నిప్పునంటూ పరిచయం చేసుకుంటుంటాడు. అంతేలే మరి. లోకంలో మనుషులెవరైనా తన గొప్పలు తాను చెప్పుకోక ఎవరికి ఏం తీట తనను పొగడటానికి. కానీ అధికారంలో ఉన్న వారిని కొన్ని భజన సంఘాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా పొగిడేస్తుంటారనుకో... అది వేరే విషయం. తన్ను గురించి తాను పొగుడుకోవడంలో చంద్రబాబు, వెంకయ్య నాయుడులు సుప్రసిద్ధులు. చంద్రబాబు అయితే తాను నిప్పులా బ్రతికానని ఊతపదంలా చెప్పుకుంటుంటాడు.

చంద్రబాబు... జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. వారొక నరహంతకులని, ఫ్యాక్షనిస్టులని, తెదేపా నాయకుడు పరిటాల రవిని పొట్టనబెట్టుకున్నవాళ్ళని, అనంతపురం కేంద్రంగా పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలను చంపేసి నాయకులుగా ఎదిగారని దేశమంతా వినిపించేలా చాటింపు వేశాడు. ఆ రకంగా వారిని శిక్షించాలని గవర్నర్ మొదలుకొని, రాష్ట్రపతి వరకు అందరికీ వినతిపత్రాలు సమర్పించి మరీ వేడుకున్నాడు. అల్లా ఉంటుందన్న మాట చంద్రబాబు రాజకీయ ఆవేశం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.... అదే జెసి బ్రదర్స్ తెదేపాలోకి వచ్చాక రాయలసీమలో చంద్రబాబు జేసీని అనుంగు శిష్యుడుగా మార్చుకున్నాడు. ఇప్పుడు  చంద్రబాబు జేసీని, జగన్ ను తిట్టేందుకు పెట్టుకున్నాడా అనేంతగా పిచ్చి ముదిరిపోయింది. అలా అవకాశం చిక్కినప్పుడల్లా జగన్ ను జేసీ తెగ తిట్టేస్తున్న విషయం కూడా తెలిసిందే.  

దివాకర్స్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పదికొండుమంది వరకు చనిపోయారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు జేసీ బ్రదర్స్ ను కాపాడేందుకు వారి బృందం తోడ్పాటుతో సర్వ ప్రయత్నాలు చేశాడు. రెండో డ్రైవర్ బస్సు డిక్కీలో పడుకుని ఉన్నాడని కూడా ఒక పోలీసు పెద్దాయన చేత పిట్ట కథ అల్లించాడు. అసలు ఇటువంటి కథల ద్వారా చంద్రబాబు జేసీ పన్నిన అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేయిస్తుండటం, ఇటువంటి నాయకులకు ఇంకా వత్తాసు పలకడంతో చంద్రబాబు నాయుడికున్న సహజమైన ఇమేజ్ కి డ్యామేజ్ ఏర్పడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? రేపు అసెంబ్లీ సమావేశంలో బహిరంగంగా జేసీ బ్రదర్స్ చేత బాబు నిప్పు అంటూ ప్రచారం చేయించుకుందామని, ఆ రకంగా జగన్ ను నిలువరిద్దామని బాబు ఆలోచన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతదో.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ