సినిమా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఉండే స్టార్స్‌లో పవన్ ఒకడు. కానీ సినిమా అనేది వ్యాపారం. కాబట్టి పవన్ జయాపజయాలను పట్టించుకోడు అంటే వీలుకాదు. 'గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది' చిత్రాల తర్వాత చాలాకాలంగా పవన్‌కి హిట్ లేదు. 'గోపాల.. గోపాల' చిత్రం కూడా కేవలం ఓ మోస్తరు లాభాలను తెచ్చిందే గానీ బ్లాక్‌బస్టర్ కాలేదు. ఇక ఆయన తాను, తన స్నేహితుడైన శరత్‌మరార్‌లతో తీసిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ చిత్రం తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయనేది వాస్తవం అంటున్నారు. ఈ చిత్రం పంపిణీదారులకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ట్రేడ్‌వర్గాల సమాచారం ప్రకారం 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రీరిలీజ్ థియేటికల్ రైట్స్ 87కోట్లుకు అమ్ముడుపోయాయంటున్నారు. కానీ చిత్రం కేవలం 50 నుంచి 55 కోట్లలోపలే వసూలూ చేసిందంటున్నారు. దీంతో పంపిణీదారుల నష్టాలను భర్తీ చేయడానికే పవన్ మరోసారి శరత్‌మరార్‌కి 'కాటమరాయుడు' చిత్రం చేస్తున్నాడు.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేటికల్ రైట్స్ కూడా దాదాపు 'సర్దార్' లాగానే 87 నుంచి 90కోట్ల వరకు బిజినెస్ చేసిందంటున్నారు. ఇక అదే నిజమైతే ఈ చిత్రానికి లాభాలు రావాలంటే కనీసం 100కోట్లైనా వసూలు చేయాలి. ఇక 'సర్దార్ గబ్బర్‌సింగ్' నష్టాలను కూడా ఈ 'కాటమరాయుడు'తో తీర్చడానికే తీస్తున్నారు కాబట్టి ఆ చిత్రం నష్టాలను కూడా భర్తీ చేయాలంటే ఈ చిత్రం కనీసం అటు ఇటుగా 150కోట్లు వసూలు చేయాలి.
పాపం.. పవన్ ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి, సినిమా బాగాలేకపోయినా మెగాఫ్యాన్స్ అయితే చూస్తారు. కానీ కామన్ ఆడియన్ సినిమా టాక్ బాగుంటేనే చిత్రాలను చూస్తారు. మరి ఈ చిత్రానికి పెద్ద హిట్ టాక్ వస్తే తప్ప పంపిణీదారులకు లాభాలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 'సర్దార్' విషయంలో శరత్‌మరార్ మోసం చేస్తున్నాడని ఈ చిత్రం డిస్టిబ్యూటర్లు మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో పవన్ పేరు హెడ్డింగ్‌లుగా మారుతూ, పలు విమర్శలకు దారితీస్తున్నాయి.. సో.. పవన్ ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే డిస్ట్రిబ్యూటర్లపై కుచ్చుటోపీ పెట్టిన చెడ్డపేరు వచ్చేలా ఉంది. అది ఆయన రాజకీయ జీవితంపై కూడా మచ్చపడేలా చేస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అదే ఆయన వ్యతిరేకులకు ప్రధాన అస్త్రంగా మారినా ఆశ్చర్యం లేదు.