Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అల్లు ఆరాటం..!

Fri 03rd Mar 2017 01:50 PM
pawan kalyan,pawan kalyan fans,allu arjun,allu aravind,cheppanu brother  పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అల్లు ఆరాటం..!
పవన్‌ ఫ్యాన్స్‌ కోసం అల్లు ఆరాటం..!
Advertisement
Ads by CJ

ఎప్పుడైతే బన్నీ పవన్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి 'చెప్పను బ్రదర్‌' అనే వ్యాఖ్యలు చేశాడో... దాంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఇగో మీద దెబ్బకొట్టినట్లయింది. ఆ తర్వాత నుంచి పవన్‌ ఫ్యాన్స్‌కు బన్నీకి మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో బన్నీని చెడుగుడు ఆడుకుంటున్నారు. ఈ ఉదంతం జరిగి సంవత్సరం కావస్తున్నా పవన్‌ ఫ్యాన్స్‌ కోపం చల్లారలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ సోదరుడు అల్లుశిరీష్‌ ఒకానొక సందర్భంలో పవన్‌ని ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తూ 'వీపీ గాడు' అంటూ నోరుజారాడు. ఇంకేముంది... ఈ వివాదం ముదిరిపాకాన పడింది. ఇక తాజాగా 'డిజె' టీజర్‌ విషయంలో పవన్‌ ఫ్యాన్స్‌ అల్లు ఫ్యామిలీపై తమకున్న కోపాన్ని వెల్లగక్కారు. ఈ టీజర్‌కు ఎన్ని లైక్స్‌ వచ్చాయో.. దానికి కాస్త అటు ఇటుగా డిజ్‌లైక్స్‌ కూడా వచ్చాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే పవన్‌ ఫ్యాన్స్‌ నుంచి భవిష్యత్తులో కూడా బన్నీ చిత్రాల ఓపెనింగ్స్‌, మౌత్‌టాక్‌, కలెక్షన్లపై ప్రభావం పడుతోందని అల్లు అరవింద్‌ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 

దీనికోసం ఆయన పవన్‌ అభిమానులను ఎలా మచ్చిక చేసుకోవాలా? అని స్కెచ్‌లు, స్కీమ్‌లు రచించే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. బన్నీ చేత ఏదో ఒక సందర్భంలో పవన్‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పించాలని అరవింద్‌ భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే ప్రస్తుతం రెడీ అవుతోన్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం ఆడియోలోని పాటలను ఒక్కొక్కటిగా డైరెక్ట్‌గా రిలీజ్‌ చేసే క్రమంలో ఓ పాటను పవన్‌కళ్యాణ్‌ చేతుల మీదుగా విడుదల చేయాలని స్కెచ్‌ వేస్తున్నాడట. మరి అలా చేసినా పవన్‌ అభిమానుల కోపం తగ్గుతుందా? మరలా బన్నీని క్షమిస్తారా? అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ