Advertisementt

ఇంకా..ఎందుకు అమలా..అలా ఫీలవుతావ్?

Thu 02nd Mar 2017 09:22 PM
amala paul,al vijay,divorce,amala paul feeling  ఇంకా..ఎందుకు అమలా..అలా ఫీలవుతావ్?
ఇంకా..ఎందుకు అమలా..అలా ఫీలవుతావ్?
Advertisement
Ads by CJ

తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ నుండి హాట్ హీరోయిన్ అమలాపాల్ ఈ మధ్యనే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి అమలాపాల్ కాస్త లోలోపల తెగ ఫీల్ అవుతున్న విషయం కూడా విదితమే. అమలాపాల్.. విజయ్ ను ఎంతలా ప్రేమించకపోతే అంతలా ఫీలయ్ పోతుంది అనడానికి నిన్న జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. అమలాపాల్ నిన్న సాయంత్రం ఒక యాడ్ ఫిల్మ్ కోసం షూటింగ్ జరుపుకుంటుండగా ఎక్కడ నుండో ఓ మెసేజ్ వచ్చింది అమలాపాల్ కు. అది చూసిన అమలా చాలా ఎమోషన్ అయిపోయి మనసు భారంగా మార్చుకున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.  

ఇంతకీ ఏం జరిగిందంటే.. నెల క్రితమే విజయ్, అమలాపాల్ విడాకులు తీసుకున్నారు.  అయితే ఈ మధ్యనే విడాకులు తీసుకున్న దర్శకుడు విజయ్ వెంటనే రెండో వివాహం చేసుకొనేందుకు సిద్ధమైనట్లుగా అమలాపాల్ కు వార్త అందింది. ఎంత విడాకులు అయినా  2011 నుండి 2014 వరకు ప్రేమించుకొని, పెళ్ళి చేసుకున్నారు కదా. అంత మాత్రం ఫీలింగ్ ఉంటుంది కదా మరి.  కానీ, అమల పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటించడం అత్తవాళ్ళకి నచ్చకపోవడంతో కేవలం గొడవలు కారణంగానే తాము విడుపోయినట్లుగా తెలిపిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ కారణంగానే విడాకులు తీసుకున్న వీరి మధ్య ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా మరి.  ఎంత విడాకులు తీసుకున్నా తనకు విజయ్ అంటే ఇష్టమని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో కూడా అమలా పాల్ వ్యక్తపరచిన విషయం తెలిసిందే. అలాంటి అమలాపాల్ కి ఉన్నట్టుండి ఒక్కసారిగా విజయ్ మళ్ళీ రెండో వివాహం చేసుకోబోతున్నాడని తెలియగానే తీవ్రమైన ఉద్వేగానికి లోనైనట్టు తెలుస్తుంది. దాంతో షూటింగ్ లో కూడా పాల్గొనే మూడ్ లేక ప్యాకప్ చెప్పినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. మొత్తానికి అమలా ఎంత విడాకులు తీసుకున్నా విజయ్ ని మాత్రం మర్చిపోలేకపోతుందంట. అందుకే ఇంత డిస్ట్రబ్ అయినట్లుగా తెలుస్తుంది. కానీ ఆమె స్నేహితురాండ్రు మాత్రం విడాకులు తీసుకున్నాక కూడా అంతగా ఫీల్ కావాల్సిన అవసరం లేదని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ