ఆ మధ్యన వి.వి.వినాయక్, చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' చిత్రం చేస్తున్నప్పుడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ తో 'ఖైదీ....' చిత్రం కంప్లీట్ కాగానే ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. ఇక సాయి కూడా తన కెరీర్ కి ఉపయోగపడే సినిమా ఇప్పటివరకు లేకపోవడంతో వి.వి.వినాయక్ తో అయినా ఒక మాస్ సినిమాలో నటిస్తే అది తన కెరీర్ కి హెల్ప్ అవుతుందని వినాయక్ డైరెక్షన్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ప్రచారమూ జోరుగా జరిగింది. ఇక వినాయక్ అయితే సాయి తో చేసే సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా అప్పుడే మొదలు పెట్టేశాడనే న్యూస్ హల్ చల్ చేసింది.
అదంతా అలా ఉంటే ఇప్పుడు సాయి ధరమ్ నటించిన 'విన్నర్' అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. తాజాగా సాయి ధరమ్ తేజ, వి.వి.వినాయక్ తో సినిమా చెయ్యడం లేదని చెప్పి షాక్ ఇచ్చాడు. అంతేకాదు ఆయన డైరెక్షన్ లో చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెబుతున్నాడు. అసలు వినాయక్ గారితో నాకు పరిచయమే చాలా తక్కువ అని.... వినాయక్ గారిని ఒకటి రెండు సార్లు కలిశానని అదీ సినిమా కోసం కాదని వేరే కారణాలతో ఆయన్ని కలవడం జరిగింది అంతే అని...... ఇక ప్రస్తుతానికి మా కాంబినేషన్లో మాత్రం సినిమా లేదు..... ఇప్పుడు నేను ఒక్క 'జవాన్' కి మాత్రమే కమిట్ అయ్యానని చెబుతున్నాడు.
ఇక వినాయక్ గారితో నేను సినిమా చెయ్యాలని.. అది నా డ్రీమ్ అని చెబుతున్నాడు.... కానీ సినిమా ఎప్పుడుంటుందో మాత్రం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు.