2019లో జరగబోయే సాధారణ ఎన్నికలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. ఆ దిశగా అడుగులు వేస్తూ జనసేనాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పలు సందర్భాల్లో పవన్ వెల్లడించాడు కూడాను. దీంతో జనసేన పార్టీ టిక్కెట్ల కోసం ప్రముఖులంతా ఇప్పటికే కన్నేసి పలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కొన్ని నియోజక వర్గాలను కన్ఫామ్ చేసేసుకొని మరి అందుకోసం అప్పుడే పనులు కూడా చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఆయా ప్రాంతాలలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తమకే కావాలంటూ బహిరంగంగానే పలు వేదికలపై ప్రకటిస్తున్న విషయం కూడా తెలిసిందే.
ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో... కొంతమంది ఎమ్మెల్యే, ఎంపీలు జనసేనలోకి జంప్ కావాలని ఇప్పటికే నిర్ణయాలు కూడా తీసుకున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా క్యూలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా కొంతమంది సినిమా ప్రముఖులు కూడా జనసేనలో చేరేందుకు పవన్‌ను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ఆ దిశగా ఇప్పటివరకు పవన్ అంటే ఎడమొహం, పెడమొహంగా ఉన్నవాళ్ళు, అతనంటే గిట్టని వారు సైతం పవన్ కు అనుకూలంగా మాట్లాడి మదిలో పడేందుకు తగిన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రముఖ క్రీడాకారులు సైతం జనసేన పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు జనసేనకు తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా ఈ మధ్య టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా రాబోవు ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తానని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించిన విషయం తెలిసిందే. పవన్ సీటిస్తే అందుకు తాను ఎప్పుడూ రెడీ అని కూడా తెలిపాడు. ఇంకా బండ్ల మాట్లాడుతూ.. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చేది జనసేన పార్టీయే అంటూ వివరించాడు. అయితే తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన మనస్సులోని అభిప్రాయాన్ని కూడా వెల్లడించింది. త్వరలోనే తాను పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటూ ప్రకటించి అదీ జనసేన పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీ కావాలని తన కోరికను వెలిబుచ్చింది. ఇంకా గుత్తా జ్వాల మాట్లాడుతూ.. తనకు జనసేన అంటే ఇష్టమని కూడా వివరించింది. మొత్తానికి జనసేనానిని రాజకీయాల్లో కూడా లేడీ గ్లామర్ వదలడం లేదుగా... చూద్దాం పవన్ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో.