దిల్‌రాజు కాంపౌండ్ నుండి దర్శకునిగా పరిచయమైన అనేక దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. తన మొదటి చిత్రం 'కొత్త బంగారు లోకం'తో ఆయన అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దిల్‌రాజు అండతో ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు, విక్టరీ వెంకటేష్‌లను ఒప్పించి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి మల్టీస్టారర్‌ని తీసి టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి మరలా శ్రీకారం చుట్టాడు. ఇందులో మహేష్, వెంకీ ఇద్దరి అభిమానులను సంతృప్తి పరచడమే కాదు... ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే కుటుంబ బంధాలు, అనుబంధాల నేపధ్యంలో ఓ మంచి ఫ్యామిలీ హిట్‌ను అందించాడు. ఇక ఈ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాలపై మహేష్‌కు మంచి అభిప్రాయం ఏర్పడింది. దాంతో ఆయన పివిపి బేనర్‌లో శ్రీకాంత్ అడ్డాలతో 'బ్రహ్మోత్సవం' చిత్రం చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఆయన పూర్తి స్క్రిప్ట్‌తో రాలేదని, తాననుకున్నట్లు స్పాట్‌లో ఏవేవో నిర్ణయాలు తీసుకున్నాడని ఎన్నో విమర్శలు వచ్చాయి. చివరకు శ్రీకాంత్‌పై ఉన్న నమ్మకంతో మహేష్ కూడా ఈ చిత్రం కథను కూడా వినకుండా డైరెక్టర్‌పై నమ్మకంతో డేట్స్ ఇచ్చాడు. కానీ ఇది డిజాస్టర్‌గా మిగలడమే కాదు.... అన్ని వేళ్లు శ్రీకాంత్ వైపే చూపించాయి. మహేష్ కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలింది. అయినా కూడా మహేష్ ఈ చిత్రం విషయంలో తన తప్పు కూడా ఉందని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అయినా కూడా శ్రీకాంత్ అడ్డాలకు ఇప్పటివరకు మరో చాన్స్ రాలేదు. ఏ హీరో కూడా ఆయన తయారు చేసుకొన్న ఓ కొత్త కథను వినడానికి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలా ఎందరికో తన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన చేజేతులా వమ్ము చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన మరలా మంచి చిత్రానికి అవకాశం దక్కించుకోవాలంటే పూర్తి స్క్రిప్ట్‌తో దిల్‌రాజు వంటివారిని మెప్పించడమే మార్గం. మరలా ఆయన జీరో నుండి స్టార్ట్ కావాలి. మంచి కథతో వస్తే తాను ఓ చిత్రం చేస్తానని అల్లుఅరవింద్ కూడా శ్రీకాంత్ అడ్డాలకు హామీ ఇచ్చాడట. మరి శ్రీకాంత్ ఈసారైనా మరలా తనను తాను నిరూపించుకుంటాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....!