రేణుదేశాయ్‌ మరో సంచలనం..!

CineJosh news

రేణుదేశాయ్‌.. ఈ పేరు తెలియని వారు ఉండరు. సినిమాలలో బిజీగా ఉన్నప్పుడు 'బద్రి' చిత్రంతో పవన్‌ ప్రేమకు బందీ అయిపోయింది. ఆ తర్వాత ఆయనను వివాహమాడి మీడియాకు దూరంగా ఉంది. ఆ సమయంలో ఆమె ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు. ఇక పవన్‌తో విడాకుల తర్వాత మాత్రం ఆమె అనేక ఇంటర్వ్యూలలో తన గురించి, పవన్‌ గురించి, తన పిల్లల విషయాలు, తాను పడ్డ కష్టాలు, బాధలు, తన మనసులోని ఆవేదనలను పలు ఇంటర్య్యూలలో తెలిపింది. ఇక ఆమె ప్రస్తుతం మరాఠీ చిత్రాలకు నిర్మాతగా, దర్శకురాలిగా మారింది. అయితే ఆమెకు విజయాలు లభించడంలేదు. పవన్‌-రేణుల కొడుకు అకీరాను పరిచయం చేసిన 'ఇష్క్‌వాలాలవ్‌'ను తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేయాలని భావించింది. కానీ పలు కారణాల వల్ల ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ థియేటర్లలో విడుదలకాలేదు, ఇక ఏకంగా ఈటీవీలో ఒకేసారి బుల్లితెరపై ప్రసారమైంది. కాగా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆమె తాజాగా ఉమెన్స్‌ డే సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్‌ ప్రేమకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి8న ప్రసారం కానుంది. కాగా ఈ ఇంటర్వ్యూలో ఆమె ఇప్పటి వరకు చెప్పని పలు రహస్యాలు, తాను పడ్డ వేదనలు, తన కష్టాలు, పవన్‌ భావాల గురించి కూడా చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మార్చి8న ఈ ఇంటర్వ్యూ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

renudesai
renu desai interview
march 8
womens day