టాలీవుడ్ లోనే కాకుండా భారత చలన చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన సినిమా బాహుబలి. ఇప్పుడు బాహుబలి 2 చిత్రం విడుదల కోసం భారత దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి ది బిగినింగ్ సాధించిన విజయాలను.. రెండవభాగం అధిగమించే అవకాశం ఉందని ఇదివరకే వెల్లడైన విషయం తెలిసిందే. బాహుబలి మొదటి భాగం రికార్డులను ఖచ్చితంగా మించిపోయి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా అభిమానులు నమ్ముతున్నారు. కాగా ప్రస్తుతం బాహుబలి రెండవభాగం షూటింగ్ పూర్తి చేసుకొని వేగవంతంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అతిత్వరలోనే ఆడియో కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమౌతుంది.
అయితే తాజాగా ఆడియో విడుదల తేదీ, ఎక్కడ జరపాలన్నది కూడా నిర్ణయం అయిపోయినట్లుగానే తెలుస్తుంది. ఉగాది రోజున అంటే మార్చి 29వ తేదీ బాహుబలి 2 ఆడియో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలా ఉగాది రోజున కానీ, ఆ ముందు రోజున గానీ బాహుబలి 2 ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఆడియో వేడుకను ఎక్కడ జరపాలన్న విషయంపై కూడా చిత్రబృందం స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగానే తెలుస్తుంది. మొదట వైజాగ్, తిరుపతి, విజయవాడ వంటి చోట్ల నిర్వహించాలని భావించినా ఆ తర్వాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేడుక నిర్వహించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం మాహీష్మతీ సెట్ వేసిన విషయం తెలిసిందే. ఆ సెట్ వద్ద వేడుక జరపాలనుకొని భావించినా, రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్ నుండి మాషీష్మతీ సెట్ వరకూ జనాలు ఎక్కుడ క్రౌడ్ ఏర్పడితే కష్టం అవుతుందని, ఫిల్మ్ సిటీ ఎంట్రీ గేట్‌కి దగ్గరలో ఆడియో వేడుక నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నట్లు తెలుస్తుంది.