హరీష్‌శంకర్... ఈ దర్శకునిలోని ఫైర్‌ని గుర్తించి 'గబ్బర్‌సింగ్'కి దర్శకునిగా అవకాశం ఇచ్చి స్టార్ డైరెక్టర్‌ని చేసిన ఘనత పవన్‌కి చెందుతుంది. ఇక ఆ తర్వాత హరీష్ మరలా ఫామ్ కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. ఇటీవలే మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం ఓకే అనిపించడంతో దిల్‌రాజు, బన్నీల ఆశీర్వాదంతో బన్నీ హీరోగా 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ మహాశివరాత్రికి విడుదలై మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు 5మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఈ చిత్రం టీజర్‌కు ఒక లక్ష లైకింగ్స్‌వస్తే , ఇంకో లక్ష డిజ్‌లైక్స్ కూడా రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ డిజ్‌లైక్స్ వెనుక పవన్ అభిమానులు ఉన్నారనే వాదనలు కొందరు వినిపిస్తున్నారు. ఇక 'చెప్పను బ్రదర్' అనే బన్నీ వ్యాఖ్యల నుంచి పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఈ విషయంలో అనవసరంగా దర్శకుడు హరీష్‌శంకర్ కూడా తలదూర్చాడేమో అని ఆయన తాజా ట్వీట్‌ను చూస్తే అనిపించకమానదు.
'డిజె' చిత్రం టీజర్ 5 మిలియన్ వ్యూస్‌ని సాధించిన సందర్భంగా హరీష్‌శంకర్ తన ట్వీట్‌లో 'థ్యాంక్స్ ఫర్ ది వ్యూస్.. థ్యాంక్స్ ఫర్ ది డిజ్‌లైక్స్' అని ట్వీట్ చేస్తూ ' యధ్భావం తత్‌భవతి.. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే...నిబిడాశ్యర్యంతో వీరు.... నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే....నిర్ధాక్షిణ్యంగా వీరే... ' అంటూ 'మహాప్రస్థానం'లో మహాకవి శ్రీశ్రీ చెప్పిన ఓ కవితలోని పదాలను ఈ ట్వీట్‌లో ఉంచాడు. దీనికి ఎన్నో అర్ధాలున్నాయి. మనిషి మనిషిని బట్టి, మనసు మనసును బట్టి దీనిని ఎవరికి తగ్గట్లుగా వారు అన్వయించుకునే కవిత ఇది. మరి ఇది హరీష్‌శంకర్.. పవన్ అభిమానులను ఉద్దేశించే చేశాడని ఎక్కువశాతం మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో మంచి భవిష్యత్తు ఉన్న హరీష్‌శంకర్ అనసవరంగా ఈ వివాదంలోకి తలదూర్చాడేమో అని ఆయన ఫ్యాన్స్ కూడా అనుకుంటుండటం విశేషం.