అక్కినేని వారసుడు అఖిల్, శ్రియాభూపాల్‌ల నిశ్చితార్ధం జరిగిన తర్వాత ఈ పెళ్లి ఆగిపోయిందని అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. బ్రేకప్‌కి కారణాలు మాత్రం ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కాగా ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్-శ్రియాభూపాల్‌ల వివాదమే దీనికి కారణం అంటున్నారు. కానీ ఈ బ్రేకప్ ఎప్పుడో జరిగిందని, కానీ మీడియానే దానిని పసిగట్టలేకపోయిందని, వారు చాలా ఆలస్యంగా విషయం తెలుసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని ఎన్ని వార్తలు వస్తున్నా అక్కినేని ఫ్యామిలీ నుండి గానీ జీవీకే ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం, ఖండన లేకపోవడంతో ఈ వార్తలకు రెక్కలు వచ్చాయి.
కాగా తాను ఎంతో నమ్మిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం డిజాస్టర్ కావడం, అఖిల్ వివాహం రద్దు కావడంతో నాగ్ బాగా డిప్రెషన్‌కు లోనయ్యాడనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క తాజాగా అమల కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరైనా కూడా ఆమె మీడియాను తప్పించుకుంది.. కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం నాగ్ తనకిష్టమైన సెల్‌ఫోన్ నెంబర్‌ని కూడా మార్చివేసి, కొత్త నెంబర్‌ను వాడుతున్నాడని సమాచారం. అభిమానులు, పెద్దలు, ఆయన ఫ్యామిలీకి ఆప్తులు, స్నేహితులు వంటి వారి పరామర్శ కాల్స్ ఎక్కువ కావడంతో నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. కేవలం తనకు బాగా సాన్నిహిత్యం ఉన్న వారితోనే గడుపుతున్నాడట. ఈ ఇష్యూ కాస్త తెరమరుగైన తర్వాత మాత్రమే తన పాత నెంబర్‌ను మరలా యాక్టివేట్ చేస్తాడని, అప్పటివరకు ఆయన కొత్త నెంబర్‌నే వాడుతాడని సమాచారం.