Advertisementt

అనుపమ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకోవలసిందే!

Wed 01st Mar 2017 01:56 PM
anupama parameswaran,ram charan movie,jr ntr and bobby movie,anupama confidence  అనుపమ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకోవలసిందే!
అనుపమ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకోవలసిందే!
Advertisement
Ads by CJ

అనుపమ పరమేశ్వరన్‌.. ఆమె ఇటీవల టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. ఆమె టాలీవుడ్‌లో నటించిన మొదటి మూడు చిత్రాలైన 'ప్రేమమ్‌, ఆఆ, శతమానం భవతి'లతో హ్యాట్రిక్‌ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు గోల్డెన్‌లెగ్‌ అనే పేరు వచ్చింది. ఇక ఏ అప్‌కమింగ్‌ హీరోయిన్‌ అయినా స్టార్స్‌ చిత్రాలలో అవకాశం వస్తే ఎగిరిగంతేస్తారు. అలాంటి అవకాశాలు చేజారితే కుంగిపోతారు. ఇది సహజం. కానీ ఈ కేరళ కుట్టి అయిన అనుపమ మాటలను వింటుంటే మాత్రం ఆమె నమ్మకానికి అమ్మలా కనిపిస్తోంది. ఆమెకు సుకుమర్‌, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. మరి ఏవో కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను సమంత తన్నుకుపోయింది. ఈ చిత్రంలో తనకు అవకాశం వచ్చిన మాట వాస్తవమేనని, కానీ అది పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదంటోంది ఈ అమ్మడు. 

ఇక ఎన్టీఆర్‌-బాబిల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా ఈ అమ్మడికి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఛాన్స్‌ తన వద్దకు రాలేదని ఆమె అంటోంది. తన వయసు ఇంకా 21ఏళ్లే అని వయసును కూడా డేర్‌గా చెప్పేసింది. తనకు ఇంకా చాలా కెరీర్‌, భవిష్యత్తు ఉన్నాయని, ఆ సమయంలో తాను అందరి హీరోల సరసన నటించడం ఖాయమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. అవకాశాలు మిస్సయినా తనకు బాధ లేదని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. మొత్తానికి అ అమ్మడి కాన్ఫిడెన్స్‌ను మాత్రం అభినందించకుండా ఉండలేం. ఈ స్టేట్‌మెంట్స్‌ను చూసిన కొందరు విశ్లేషకులు ఈమె మలయాళం భాషను కూడా వదిలేసి టాలీవుడ్‌లోనే మకాం వేసినా ఆశ్యర్యం లేదంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ