Advertisementt

పురంధేశ్వరి మంచి ప్లానింగ్ లోనే వుంది..!

Wed 01st Mar 2017 01:46 PM
purandeswari,roja,bjp,ysrcp,tdp  పురంధేశ్వరి మంచి ప్లానింగ్ లోనే వుంది..!
పురంధేశ్వరి మంచి ప్లానింగ్ లోనే వుంది..!
Advertisement
Ads by CJ

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగి మంచి హోదాలు అనుభవించిన దగ్గుబాటి పురంధేశ్వరి ఈ మధ్య పార్టీ మారుతున్నారనే వార్తలు ముమ్మరంగా ఊపందుకున్నాయి. మొన్న భాజపా నాయకుడు విష్ణుకుమార్‌ రాజు కుటుంబంలో జరిగిన వేడుకలో భాగంగా వైకాపా ఎమ్మెల్యే రోజాతో కలిసి పురంధేశ్వరి పోటో దిగడంతో ఈ ఊహాగాలకు ముమ్మరంగా తెరలేసింది. రాష్ట్ర విభజన జరిపిన కాంగ్రెస్ పార్టీతో కష్టమని, భాజపాలో చేరిన పురంధేశ్వరి స్థానికంగా తెదేపాతో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. భాజపా అధికారంలో ఉన్నా తనకు తగిన గుర్తింపుగానీ, న్యాయంగానీ జరగడం లేదన్న విషయాన్ని ఆమె అడుగడుగునా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం వైకాపాలో చేరే ఆలోచన లేదని, ముందు ముందు కూడా అలాంటిది జరగదని బయటకు చెబుతున్నా ఇటువంటి కథనాలను ఆమె ఏమాత్రం ఖండించడం లేదు.  

అయితే అసలే పార్టీలో అసంతృప్తితో ఉన్న పురంధేశ్వరి ఇలాంటి కథనాలు కూడా తమకు అనుకూలమవుతాయని అలా మిన్నకుండి పోతుంది. వీటి ద్వారా చంద్రబాబుపై కూడా ఒత్తిడి పెరుగుతుందని, అలా భాజపా నాయకులు కూడా తమపై స్పందిస్తారని కూడా వెల్లడౌతున్న అంశం. కాగా గతంలో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది పురంధేశ్వరి. ప్రస్తుతం భాజపా అధికార ప్రతినిధిగా ఉన్నా ఏపీలో భాజపా కష్టంతో కూడుకున్న విషయంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకనే పురంధేశ్వరి వైకాపా దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అందుకు వైకాపాపై ఎమ్మెల్యే రోజా, పురంధేశ్వరితో మంత్రాంగం నడిపిస్తున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాబోవు 2019 సాధారణ ఎన్నికల్లో వైకాపా తరఫున విశాఖ పట్టణం పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీ చేయించేందుకు వైకాపా కూడా సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఏపీలో వైకాపా కొంచం కొంచంగా బలపడుతుందనే అనుకోవాలి. చూద్దాం ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ