Advertisementt

రామ్ చరణ్ సినిమాలో ఆ హీరో కూడా..!

Wed 01st Mar 2017 12:50 PM
ram charan,sukumar,vaibhav,vaibhav in ram charan film  రామ్ చరణ్ సినిమాలో ఆ హీరో కూడా..!
రామ్ చరణ్ సినిమాలో ఆ హీరో కూడా..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో ఒక ప్రేమ కథా చిత్రాన్ని చెయ్యడానికి రెడీ అయిపోయాడు. ఇక అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన లుక్ ని పూర్తిగా మార్చేసాడని అంటున్నారు. ఇక 'ధృవ' కోసం పెంచిన బాడీని కూడా కరిగించి సుకుమార్ చిత్రం కోసం రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాడని టాక్. పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్తగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని వారింటికి కాబోయే కోడలు సమంత మొదటిసారిగా రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతుంది.

అదేమిటంటే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్, రామ్ చరణ్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నాడని. మరి ఈ వార్త నిజమా లేక రూమరా అనేది తెలియాల్సి వుంది. ఇకపోతే ఇప్పటికే అల్లు అర్జున్ 'సరైనోడు'లో హీరో ఆదిని విలన్ గా చూపించి సక్సెస్ అయిన బోయపాటివలె.... సుకుమార్ కూడా వైభవ్ ని ఏ యాంగిల్ లో చూపిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరి వైభవ్ తమిళంలో వరుస ఆఫర్స్ తో బిజీగా వున్నాడు. ధృవ చిత్రం లో నవదీప్ కి మంచి పేరు వచ్చినట్లే..ఈ చిత్రం లో కూడా వైభవ్ కి ఓ మంచి రోల్ ఉందని, టాలీవుడ్ లో కోదండరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లది మంచి కాంబో కావడంతో పాటు కుటుంబాల మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉండటం తో..వైభవ్ ఈ మూవీలో ఛాన్స్ అనగానే కథ కూడా అడగకుండా వెంటనే ఒప్పేసుకున్నాడని టాక్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ