'సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాత డైరెక్టర్ బాబీ కి ఎవ్వరూ దర్శకుడిగా అవకాశం ఇవ్వలేదు. ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి తాను కారణం కాకపోయినా కూడా ఫలితం మాత్రం ప్రత్యక్షంగా బాబీ అనుభవించాడు. అయితే బాబీ... అవకాశాలు రాకపోయినా ఏమాత్రం డిస్పాయింట్ అవ్వకుండా ఒక మంచి కథను డెవలప్ చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ మధ్యన కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాడు. 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్ అందుకున్నాక ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని డైరెక్టర్ బాబీ చెప్పిన కథను ఒకే చేశాడు. ఇక ఎన్టీఆర్ చిత్రాన్ని తానె నందమూరి బ్యానర్ లో నిర్మిస్తానని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఇక కళ్యాణ్ రామ్ - బాబీ - ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ తెరమీదకి వచ్చి అధికారికంగా పూజ కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ మీదకెళ్ళిపోయింది.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఇక ఆ పాత్రలకు తగ్గట్టే టైటిల్ కూడా కళ్యాణ్ రామ్ 'జై లవ కుశ' అని రిజిస్టర్ చేయించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ టైటిల్ ఎన్టీఆర్ చిత్రానికే అని అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనబడతాడని అందులో ఒక కేరెక్టర్లో క్రికెటర్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ కి బాబీ స్టయిల్ నచ్చడం.... తనని కొత్తగా చూపించడానికి బాబీ పడుతున్న శ్రమను చూసిన ఎన్టీఆర్ ఇంప్రెస్స్ అయ్యి బాబీ కి ఒక గిఫ్ట్ ప్రెసెంట్ చేసాడనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ కి స్వతహాగా వాచెస్ అంటే ఉండే ఇష్టంతో బాబీకి కూడా ఒక మంచి వాచ్ ని ప్రెసెంట్ చేసాడట. అయితే ఆ వాచ్ ఖరీదు మాత్రం కళ్ళు చెదిరేలా వుంది. ఆ వాచ్ ఖరీదు కేవలం నాలుగు లక్షల రూపాయలేనట. ఇక ఈ గిఫ్ట్ అందుకున్న బాబీ మాత్రం ఫుల్ జోష్ లో మునిగి తేలుతున్నాడట. ఇక బాబీ మాత్రం తనకు మంచి బహుమతినిచ్చిన ఎన్టీఆర్ కి వారి కాంబినేషన్ లో రాబోయే చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిపోయాడని టాక్.