వెండితెరపై, ఆ తర్వాత బుల్లితెరపై నటునిగా బిజీగా ఉన్న సమయంలోనే నటుడు రాజారవీంద్ర కొంతకాలం చిరంజీవి డేట్స్ చూశాడు. ఆతర్వాత రవితేజ, సునీల్, నిఖిల్, రాజ్‌తరుణ్, మంచు విష్ణు, జయసుద వంటి వారికి మేనేజర్‌గా పనిచేశాడు. కాగా ఇటీవలి కాలంలో రాజారవీంద్రకు రవితేజతో విభేదాలు వచ్చాయి. తాజాగా ఆయన ఈ విషయం ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, రవితేజతో నాకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉంది. దాంతో ఆర్టిస్ట్‌గా ఆయన బిజీగా ఉన్న సమయంలో నన్ను డేట్స్ చూసిపెట్టమని చెప్పాడు. ఆయనకు కాళ్లు కడిగి పెళ్లి చేశాను. నేను రవితేజను 'ఏరా' అని పిలిచేవాడిని. దాంతో ఆయన అసౌకర్యంగా ఫీలయివుంటాడు.
ఇక ఎక్కువ కాలం కలిసి పనిచేసినందు వల్ల ఆయనకు బోర్ కొట్టినట్లుంది. కొంతకాలం తర్వాత ఓ ఏడాది నా పని నేను చూసుకుంటాను.. నీ పని నువ్వు చూసుకో అన్నాడు. అలా మేము కొంతకాలం విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అంతేగానీ రవితేజ విషయంలో నేను ఆయన ఆర్థిక విషయాలలో తలదూర్చేవాడిని కాను. ఇప్పటికీ ఆయన కుటుంబంతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి.. అని చెప్పుకొచ్చాడు. ఇక మొత్తానికి రవితేజ నటునిగా, హీరోగా బిజీ కావడంలో, ఆయన కథలు,నిర్మాతలు, దర్శకుల ఎంపికలో రాజా రవీంద్రకి కూడా క్రెడిట్ దక్కుతుందనేది వాస్తవం.
పరిశ్రమలోని అందరితో మంచి స్నేహసంబంధాలు ఉండటం, మంచి మాటకారి, కలుపుగోలు వ్యక్తి అయి ఉండటం, పరిశ్రమలో ఎంతో కాలంగా ఉన్న సీనియర్ కావడం, కథల విషయంలో, నిర్మాతల ఎంపిక విషయంలో మంచి పరిజ్ఞానం ఉన్న వాడు కావడం వల్ల రాజారవీంద్రను మేనేజర్‌గా పెట్టుకోవడానికి చాలా మంది ఆసక్తిని చూపుతుంటారు. మరి కుడిభుజం లేకుండా మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌ను తానే స్వంతంగా ఎంతవరకు నెగ్గుకురాగలడు? అనేది వేచిచూడాల్సివుంది.