Advertisementt

ఈ రచయిత బుర్రకి పదునెక్కువే..!

Tue 28th Feb 2017 12:18 PM
  ఈ రచయిత బుర్రకి పదునెక్కువే..!
ఈ రచయిత బుర్రకి పదునెక్కువే..!
Advertisement

సాయిమాధవ్‌ బుర్రా.. ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా వినపడుతోన్న పేరు. ఇక పలువురు రచయితలు రిటైర్‌ కావడం, పరుచూరి బ్రదర్స్‌ వంటి వారు యాక్టివ్‌గా లేకపోవడం, ఎక్కువ మంది నవతరం రచయితలు దర్శకులుగా, నటులుగా మారుతుండటంతో ఇప్పుడు టాలీవుడ్‌లో రచయితలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీనిని యువ రచయిత సాయిమాధవ్‌ బుర్రా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. క్రిష్‌ ప్రోత్సాహంతో 'కృష్ణం వందేజగద్గురుం, కంచె' వంటి చిత్రాలకు ఆయన అందించిన సంభాషణలు అందరినీ ఆలోచింపజేశాయి. ఇక శర్వానంద్‌ హీరోగా నిత్యామీనన్‌ హీరోయిన్‌గా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' చిత్రంలో తన సంభాషణలలో ఆయన అద్భుతమైన ఫీల్‌ని తెచ్చాడు. ఇక ప్రతిభను ఎక్కువగా ప్రోత్సహించే పవన్‌కళ్యాణ్‌ దృష్టిలో పడ్డాడు. ఆయన నటించిన 'గోపాల గోపాల'తో పాటు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' కి కూడా రచనాశాఖలో పనిచేశాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతి ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోయే సీజన్‌. పక్క పక్క రోజులలో రిలీజ్‌ అయిన ఇద్దరు సీనియర్‌ స్టార్స్‌ నటించిన ప్రతిష్టాత్మక చిత్రాలకు ఆయన పనిచేశాడు. అవే చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150', బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'. ఇక చిరు చిత్రంతో పాటు 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి ఆయన సంభాషణలే ఆయువుపట్టుగా నిలిచాయనేది వాస్తవం. కాగా మార్చి3వ తేదీన విడుదల కానున్న రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ఆయనలోని విలక్షణ రచయితను ఆవిష్కరించనుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్స్‌లోని డైలాగ్‌లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి. ఆయనలోని కామెడీ కోణాన్ని, ఎంటర్‌టైనింగ్‌ రైటింగ్‌ యాంగిల్‌ను నిరూపిస్తున్నాయి. 'దొంగాట' దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈచిత్రంతో సాయిమాధవ్‌ బుర్రా ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement