Advertisementt

ఇప్పుడేమో అతని కెరీర్ కి బెస్ట్ ఇస్తాడేమో..!

Tue 28th Feb 2017 11:21 AM
raj tarun,nagarjuna,uyyala jampala movie,next raj tarun movie,producer nagarjuna  ఇప్పుడేమో అతని కెరీర్ కి బెస్ట్ ఇస్తాడేమో..!
ఇప్పుడేమో అతని కెరీర్ కి బెస్ట్ ఇస్తాడేమో..!
Advertisement
Ads by CJ

నాగార్జున, రాజ్ తరుణ్ కి 'ఉయ్యాలా జంపాలా' చిత్రం లో హీరోగా ఛాన్స్ ఇచ్చి అతన్ని టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఒక్క సినిమాతోనే రాజ్ తరుణ్ హీరోగా ఫుల్ మార్కులు వేయించుకున్నాడు. ఇక వరసబెట్టి సినిమాలు ఒప్పుకుంటూ సక్సెస్ సాధిస్తున్నాడు. అయితే నాగార్జున అప్పట్లో  ఈ 'ఉయ్యాలా జంపాలా' చిత్రానికి నిర్మాణ భాగస్వామ్యంలో ఒన్ అఫ్ ది పార్టన్ గా మాత్రమే వున్నాడు. నాగార్జున చిన్న సినిమాలను నిర్మిస్తూ టాలెంట్ ఉన్న వారికీ అవకాశాలు ఇస్తూ సినిమాలపై తనకున్న ఇంట్రెస్ట్ తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో పలు సినిమాలు, సీరియల్స్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఒకప్పుడు హీరోగా పరిచయం చేసిన రాజ్ తరుణ్ తో నాగార్జున ఇప్పుడు సోలోగానే ఒక సినిమా నిర్మించబోతున్నాడట. నాగ్, రంజని అనే కొత్త దర్శకురాలుని పరిచయం చేస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాడట. అయితే ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే ఈ చిత్రం అప్పుడే సెట్స్ మీదకెళ్ళి షూటింగ్ కూడా జరుపుకుంటుందని టాక్. ఇప్పటికే రాజ్ తరుణ్ నటించిన సినిమాలు వరసబెట్టి హిట్స్ కావడంతో నాగార్జున కి రాజ్ తరుణ్ మీద గట్టి నమ్మకం ఏర్పడి ఇప్పుడు తాను ఒక్కడే ఈ సినిమాని నిర్మిస్తున్నాడట. ఇక రాజ్ తరుణ్ తాజా చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఈ మార్చ్ 3 న విడుదలకు సిద్ధమయ్యింది.

అయితే హీరోగా అవకాశమిచ్చి తనని స్టార్ ని చేసిన నాగార్జున ఇప్పుడు మరోసారి అవకాశమిచ్చి తన కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాని తనకి ఇస్తారని గట్టి నమ్మకంతో రాజ్ తరుణ్ కనబడుతున్నాడని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ