ప్రభాస్ తన తోటి నటీనటులతో, దర్శకుల నుంచి లైట్‌బోయ్ వరకు అందరితో సరదాగా ఉండే వ్యక్తి. పైగా సౌమ్యుడు. లుపుగోలు వ్యక్తి. అలాంటి మంచి మనస్తత్వం ఉన్న యంగ్‌రెబెల్‌స్టార్‌తో ఓ అమ్మడు తగవు పెట్టుకుంది.. ఆంటే ఆమె ఎవరా? అని ఆసక్తి కలగక మానదు. ఆమె ఎవరో కాదు... ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన క్వీన్ కంగనారౌనత్. కాగా గతంలో కంగనా తెలుగులో ఒకే ఒక్క చిత్రంలో నటించింది. అది కూడా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'ఏక్ నిరంజన్' చిత్రంలో. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయేసరికి ఆమెకు మరలా పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది.
తాజాగా ఆమె సైఫ్‌అలీఖాన్, షాహిద్ పూర్‌లతో కలిసి నటించిన 'రంగూన్' చిత్రం మంచి విజయం సాధిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ప్రభాస్‌తో తాను గొడవ పడిన విషయం తెలిపింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలో నాకు, ప్రభాస్‌కు మధ్య పెద్ద గొడవయింది. దాంతో మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆయనతో టచ్‌లో కూడా లేను. చాలా కాలం తర్వాత 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్ నటనను, విన్యాసాలను చూసి ఆశ్చర్యపోయాను. చాలా సంతోషం వేసింది. అలాగే ప్రస్తుతం నేను నటిస్తున్న చిత్రాలు, నేను సాధిస్తున్న విజయాలను చూసి ప్రభాస్ కూడా ఎంతో గర్వంగా ఫీలవుతుండి ఉంటాడు అని వ్యాఖ్యానించింది.
కాగా మరలా సౌత్‌లో ఎందుకు నటించలేదు? అనే ప్రశ్నకు నేను దక్షిణాది నేటివిటీకి సూట్ కాను అని భావిస్తున్నట్లు తెలిపింది. నిజమే.. ఆమె తెలుగు ప్రేక్షకులను 'ఏక్‌నిరంజన్'లో కూడా ఆకట్టుకోలేకపోవడానికి ఆమె మన నేటివిటీకి సూట్ కాకపోవడమే అనే విమర్శ ఆ చిత్రం విడుదలైన సమయంలో కూడా వచ్చింది. మొత్తానికి అలా ప్రభాస్ వంటి సౌమ్యుడితోనే ఆమె గొడవపడిందంటే ఇక ఆమె మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు.. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్‌లో కూడా గొడవల మనిషి అనే ముద్దు పేరుంది.