Advertisementt

చిరు.. ఇప్పుడన్నా ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ని ఇస్తాడా..?

Mon 27th Feb 2017 08:57 PM
mega star chiranjeevi,chiru fans,chiru 151 movie,director surender reddy,khaidi no 150 movie,50 days function  చిరు.. ఇప్పుడన్నా ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ని ఇస్తాడా..?
చిరు.. ఇప్పుడన్నా ఫ్యాన్స్ కి హ్యాపీనెస్ ని ఇస్తాడా..?
Advertisement
Ads by CJ

మెగా స్టార్ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మొహానికి రంగేసుకుని ,మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక రీఎంట్రీ తోనే మంచి మార్కులు కొట్టేసి తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. చిరు కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' ఆరంభం నుండే సంచనాలు క్రియేట్ చేస్తూ.... విడుదలై కలెక్షన్స్ మోత మోగించింది. ఇక ఈ సినిమాకి ఆడియో వేడుక జరగకపోయినా కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి మెగా ఫ్యాన్స్ ని కూల్ చేశారు. ఇక ఈ ఫంక్షన్ అవడము... 'ఖైదీ నెంబర్ 150' హిట్ అవడము జరిగిపోయాయి. ఇక 'ఖైదీ నెంబర్ 150' హిట్ అవడంతో సక్సెస్ మీట్ గాని లేకుంటే థాంక్స్ మీట్ గాని నిర్వహిస్తామని మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ కి మాటిచ్చింది.

కానీ అలా మెగా ఫ్యామిలీ మాటిచ్చిందో లేదో.... ఈ మధ్యన మెగా ఫ్యామిలీకి ఆప్తమిత్రుడిగా మారిన దాసరి నారాయణరావు ఆరోగ్యం చెడిపోవడంతో ఆ ఫంక్షన్స్ కాస్తా క్యాన్సిల్ చేసేసారు మెగా ఫ్యామిలీ వాళ్ళు. ఇంకా ఈ సంఘటనతో ఖంగు తిన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు 'ఖైదీ... ' 50 రోజుల ఫంక్షన్ అయినా గ్రాండ్ గా జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. 'ఖైదీ...' చిత్రం జనవరి 11న విడుదలై మార్చ్ 1కి 50  రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.... ఈ 50  రోజుల వేడుకని అభిమాన సంఘాలు ఎవరికీ వారే గ్రాండ్ గా చెయ్యాలని చూస్తున్నారట. మరి అక్కడక్కడా జరిగే ఈ 50 డేస్ ఈవెంట్స్ కి మెగా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇక మరోపక్క చిరంజీవి తన 151వ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో చేస్తానని ఎనౌన్స్ చేసాడు. ఇంకా ఈ 151వ చిత్రం ఓపెనింగ్ ఈవెంట్ ని కూడా మెగా ఫ్యామిలీ  భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.అయితే చిరు ఈ 151వ చిత్రాన్ని 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గా చేయనున్నాడనే వార్తలొస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ